
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన `ఓజీ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. పవన్ మ్యానరిజం, స్టయిల్, యాక్షన్ సీన్లు, అంతకు మించిన ఎలివేషన్లు ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో సినిమాని థియేటర్లో చూస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా ఏళ్ల తర్వాత పవన్ మార్క్ స్టయిల్‌ని, ఆయన పవర్‌ఫుల్ రోల్‌ని చూసి సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో ఓజీ థియేటర్లు మోత మోగిపోతున్నాయి. ఓ రకంగా పవన్ తన అభిమానుల ఆకలి తీర్చాడని చెప్పొచ్చు. అయితే ఈ మూవీ కేవలం ఫ్యాన్స్ కే పరిమితమయ్యింది. అదే సమయంలో యూత్ మాత్రమే చూస్తున్నారు. ఫ్యామిలీ చూసేలా సినిమా లేకపోవడం పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. ఆ ప్రభావం సినిమాపై స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాకి వచ్చిన బ్లాక్ బస్టర్ టాక్‌కి, వస్తోన్న కలెక్షన్లకి చాలా తేడా కనిపిస్తోంది. ఇతర హీరోల అభిమానులు ఇదే విషయంపై ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా `ఓజీ` సినిమాకి సంబంధించిన నాలుగు రోజుల కలెక్షన్లు ప్రకటించింది టీమ్. నాలుగు రోజుల్లో ఈ చిత్రం ఏకంగా రూ.252 కోట్లు వసూలు చేసినట్టు ప్రకటించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు. ఇండియాలో ఈ మూవీకి భారీ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దుమ్ములేపుతుంది. కన్నడలో ఫర్వాలేదు. తమిళంలో, మలయాళంలో పెద్దగా స్పందన లేదు. నార్త్ లో స్ట్రగుల్ అవుతుంది. నార్త్ లో కలెక్షన్లు పెరిగితే సినిమా వేరే లెవల్‌కి వెళ్తుంది. కానీ ఆ స్థాయిలో సత్తా చాటలేకపోతుంది. బేసిక్‌గా హిందీలో యాక్షన్ సినిమాలను బాగా చూస్తారు. కానీ `ఓజీ`కి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. అయితే ఓవర్సీస్‌లో మాత్రం ఈ చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది. ఇండియాలో ఈ మూవీ ఇప్పటి వరకు సుమారు రూ.170కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. అలాగే ఓవర్సీస్‌లో సుమారు రూ.80కోట్ల వరకు వచ్చినట్టు తెలుస్తోంది.
`ఓజీ` సినిమాకి థియేట్రికల్ బిజినెస్ రూ.175కోట్లు అని సమాచారం. అందులో నైజాంలో రూ.54కోట్లకు అమ్ముడు పోయింది. రాయలసీమలో రూ.22 కోట్లకు, ఉత్తరాంధ్ర రూ.20కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.12.30కోట్లు, వెస్ట్ గోదావరి రూ.9కోట్లు, కృష్ణ రూ.9.50కోట్లు, గుంటూరు రూ.13.70కోట్లు, నెల్లూర్ రూ.6కోట్లు, కర్నాటక రూ.8 కోట్లు, తమిళం, మలయాళం, నార్త్ కలుపుకుని రూ.3కోట్లకు అమ్మారు. ఇక ఓవర్సీస్‌లో రూ.17.50కోట్లకు అమ్ముడు పోయిందట. ఇలా థియేట్రికల్‌గా ఈ మూవీ రూ.175కోట్లకు సేల్ అయ్యింది. దీనికితోడు డిజిటల్ రైట్స్ (నెట్ ఫ్లిక్స్ ) రూ.81 కోట్లు. అన్ని భాషలకు కలిపి. ఆడియో రైట్స్ రూ.18కోట్లు అని సమాచారం. ఇలా విడుదలకు ముందే ఈ చిత్రానికి రూ.272కోట్లు వ్యాపారం జరిగింది. సినిమాకి పెట్టిన బడ్జెట్ రూ.250కోట్లు అని సమాచారం. ఈ లెక్కన నిర్మాత విడుదలకు ముందే సేఫ్.
కానీ సినిమాకి థియేట్రికల్ బిజినెస్‌కి సంబంధించిన డబ్బులు వస్తేనే అది సక్సెస్. లేదంటే ఫెయిల్యూర్ కిందకే వెళ్తుంది. `ఓజీ` సినిమాకి సోమవారం నుంచి కలెక్షన్లు భారీగా తగ్గాయి. దసరా హాలీడేస్ అయినా ఆ జోరు కనిపించడం లేదు. దీంతో మండే నుంచి కలెక్షన్లు బాగా తగ్గే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు `ఓజీ` సినిమా సుమారు రూ.130-140 కోట్ల షేర్ సాధించింది. ఆల్మోస్ట్ 75శాతం రివకరీ అయ్యింది. ఇంకా రూ.40-50కోట్ల వరకు షేర్ రావాలి. గ్రాస్ ప్రకారం ఇంకా తొంబై కోట్ల వరకు వసూలు చేస్తే అంతా సేఫ్ అవుతారు. లేదంటే బయ్యర్లకి నష్టాలు తప్పవు. సోమవారం నుంచి వచ్చే వసూళ్లని బట్టి ఈ మూవీ ఫలితం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఇంకా వారం రోజులపాటు హాలీడేస్ ఉండటం కొంత రిలీఫ్‌నిచ్చే అంశం.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహించిన `ఓజీ` మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటించాడు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, శుభలేఖ సుధాకర్, వెంకట్, తేజ్ సప్రూ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ముంబయి గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సినిమా సాగింది. జపాన్‌కి యుద్ధం కోసం వెళ్లిన ఒక ఇండియన్ సైనికుడి కొడుకు ఓజీ తండ్రి మరణంతో సమురాయ్‌గా ఉండిపోతాడు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతాడు. కానీ అక్కడ సమురాయ్‌లను అంతం చేస్తారు స్థానిక గ్యాంగ్‌స్టర్స్. వారి నుంచి తప్పించుకుని ఇండియాకి చెందిన మాఫియా లీడర్ సత్యా దాదాతోపాటు ముంబయి వస్తాడు. అక్కడ గ్యాంగ్ స్టర్‌గా ఎదుగుతాడు. సత్యదాదాకి పోర్ట్ నిర్మించడంలో సహకరిస్తాడు. ఇక తమకు తిరుగులేదనుకునే సమయంలో ఓమీ కన్నుపడుతుంది. ఆ పోర్ట్ ని ఆక్రమించుకోవాలనుకుంటాడు. ఈ విషయం తెలిసి సత్యదాదాకి దూరమైన ఓజీ తిరిగి వచ్చి విలన్లని అంతం చేయడమే `ఓజీ` కథ. ఇందులో ఓజీగా పవన్, సత్య దాదాగా ప్రకాష్ రాజ్, ఓమీగా ఇమ్రాన్ హష్మి నటించిన విషయం తెలిసిందే.