
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ `ది రాజా సాబ్`. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రమిది. హర్రర్ ఫాంటసీ విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మారుతి. తాజాగా సోమవారం ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యింది. భారీ స్థాయిలో ఇండియా వైడ్‌గా ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
హర్రర్ అంశాలు, విజువల్స్ వండర్స్, ప్రభాస్ భయపడుతూ, భయపెడుతూ సాగే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ చూపించే విశ్వరూపం వేరే లెవల్ అని చెప్పొచ్చు. మొదట దెయ్యానికి భయపడ్డ ప్రభాస్ ఆ తర్వాత దెయ్యంతో స్నేహం చేస్తాడు. ఆ తర్వాత తానే దెయ్యంగా మారిపోతాడు. ఆ రాజమహల్‌లో ఆయన రాజుల రాయల్ లుక్‌లోకి మారి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. వారిని ఆడుకుంటాడు. అంతేకాదు మధ్యలో హీరోయిన్లతో డ్యూయెట్లు పాడుకుంటాడు. రొమాన్స్ కూడా చేస్తాడు. అదే సమయంలో కామెడీ చేస్తాడు. ఇలా ప్రభాస్ తనలోని అన్ని యాంగిల్స్ ని ఇందులో చూపించడం విశేషం. `ది రాజాసాబ్`తో వింటేజ్ ప్రభాస్‌ని చూడొచ్చు.
ఇక హర్రర్ ఎలిమెంట్లు వేరే స్థాయిలో ఉన్నాయి. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వాటిని మించి ఇందులో ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ మూవీ చూస్తున్నట్టుగానే ఉంది. చివరగా ఒక భారీ ఆకారాన్ని చూపించి సినిమాపై అంచనాలను అమాంతం పెంచాడు దర్శకుడు మారుతి. మొత్తంగా ది రాజా సాబ్ చిత్రంతో ఆయన ఇంకా ఏదో చేయబోతున్నాడని అర్థమవుతుంది. ముందు నుంచి సినిమాపై ఎన్ని అంచనాలు పెట్టుకున్నా, దాన్ని మించి ఉంటుందన్నారు. ట్రైలర్ చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఇండియన్ మూవీస్‌లో ఈ రేంజ్ విజువల్స్ చూడలేదని చెప్పొచ్చు.
ట్రైలర్‌లో ఏం చూపించారంటే.. ప్రభాస్ ఒక రాజమహల్‌కి వెళ్తాడు. అక్కడ ఓ వ్యక్తి ప్రభాస్‌ని శాసిస్తుంటాడు. కళ్లు మూసుకుని ఊపిరి తీసుకోవాలని చెప్పగా, ప్రభాస్ ఊపిరి తీసుకున్నారు. ఆయన్నుంచి ఆత్మ వెళ్లిపోతుంది. ఇంతలో దుమ్ము, ఇసుక ఆయన్నిచేరుతుంది. ఆ తర్వాత ఒక రాజుల కోటని చూపించారు. రాజమహల్‌లో సైన్యం, ప్రజలు కూర్చొని ఉన్నారు. ఇంతలో ఓ గుహలో నుంచి రాక్షసి వస్తుంది. ఇది ప్రభాస్ కళ. `చంపేశాడు బాబోయ్` అంటూ ఆయన భయపడుతూ, అందరిని బయపెట్టిస్తాడు. ఆ మహల్‌లో డబ్బులు ముట్టుకునేందుకు ప్రభాస్ ప్రయత్నించగా, అద్దాలు పగలగొట్టుకుని ఒక దెయ్యం వస్తుంది. ప్రభాస్‌తోపాటు తన స్నేహితులకు తాతని పరిచయం చేస్తుంటాడు, అదేంటని వాళ్లు అడగ్గా, దెయ్యం వస్తుంటే చూస్తారేంట్రా పరిగెత్తండి అని ప్రభాస్ చెప్పడంతో అంతా పరుగో పరుగు. అది ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.
కట్ చేస్తే ప్రభాస్‌లోని రొమాంటిక్ యాంగిల్ చూపించారు. హీరోయిన్లతో ఆయన రొమాన్స్ ని చూపించారు. లవ్ ట్రాక్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. సెడన్‌గా వాతావరణంలో ఇంత మార్పేంటని ఓ వ్యక్తి అనగా, తాత అద్భుతాలు చూసి ఆనందించాలని ప్రభాస్ చెప్పడం విశేషం. మరోవైపు నిధి అగర్వాల్ దేవకన్యలా ఆకాశంలో పైకి లేస్తూ కనిపిస్తుంది. ఆమెని చూసి తరించిన డార్లింగ్, ఆ తర్వాత ఏదో గుర్తిండిపోయే పనిచేయాలని, ఒక్కదెబ్బకి సంచలనం అయిపోవాలి, ఏంట్రా ఇలాంటి పనిచేసిండు అని అంతా షాక్ అవ్వాలని హీరోయిన్ మాళవికకి కథలు చెబుతుంటాడు. ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్, డ్యూయెట్లతో రెచ్చిపోయారు. అది ఆనందించే లోపు దెయ్యం భయపెడుతుంది. ఇక నా వల్ల కాదు, అమ్మ దుర్గా నా మనవడిని రక్షించు అని ప్రభాస్ బామ్మ చెప్పగా, అటు సంజయ్ దత్, ఇటు ప్రభాస్ యాక్షన్‌లోకి దిగుతారు. ఆయన నాలుగు మంత్రాలు చదువుకున్న మాయలపకీరు కాదు, సైక్రియాటిస్ట్, హిప్నోటాటిస్ట్, బ్రెయిన్‌తో గేమ్ ఆడుతుంటాడని బొమ్మన్ ఇరానీ.. సంజయ్ దత్‌కి ఎలివేషన్ ఇస్తాడు. మరోవైపు దెయ్యం అల్లకల్లోలం చేస్తుంటుంది.
అయితే స్టార్‌తోనే తేల్చుకుందాం. స్టార్ టూ స్టార్.. స్టార్ వార్ అని ప్రభాస్ యాక్షన్ తో రెచ్చిపోయాడు. మొసలితో ఫైట్ చేయడం అదిరిపోయింది. వరుసగా యాక్షన్ సీన్లతో రచ్చ చేశాడు ప్రభాస్. అయితే ఇదంతా సంజయ్ దత్ ఆడిస్తుంటాడు. సంజయ్ దత్‌ని ఫేస్ చేయడం సాధ్యం కాదని వాయిస్ ఓవర్‌లో రాగా, ఒక్క సారి చూడండి అంటూ ప్రభాస్ మరో లుక్‌లోకి మారిపోయారు. ఆయన రాజులా, రాయల్ లుక్‌లోకి మారిపోయాడు. మాయాజాలంతో వాహ్ అనిపించాడు. విలన్లతో ఆడుకోవడం అదిరిపోయింది. అంతేకాదు తనదైన డైలాగ్‌లతో నవ్వులు పూయించారు. ఏందిరా మీ బాధ. పుట్టలో చేయిపెడితే కుట్టడానికి నేనేమైనా చీమనా, రాక్షసుడిని అని ప్రభాస్ చెప్పడం అదిరిపోయింది. ఫైనల్‌గా భారీ ఆకారం కాలు పెట్టడం గూస్‌బంమ్స్ తెప్పిస్తోంది. చూడబోతుంటే దర్శకుడు మారుతి ఇంకా ఏదో చూపించబోతున్నాడని దీన్ని బట్టి అర్థమవుతుంది. హాలీవుడ్ ట్రీట్‌మెంట్ కనిపిస్తోంది.
ఈ సందర్భంగా సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించింది టీమ్. ఇప్పటికే ఈ చిత్రాన్ని చాలా సార్లు వాయిదా వేశారు. ఈ ఏడాది సంక్రాంతికి అనుకున్నారు. ఆ తర్వాత సమ్మర్‌కి షిఫ్ట్ అయ్యింది. అట్నుంచి డిసెంబర్ 5న అని ప్రకటించారు. ఇప్పుడు మరో డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా సినిమాని విడుదల చేయబోతున్నారు.