కృష్ణంరాజు బొబ్బిలి బ్రహ్మన్నకి పోటీగా వచ్చి అడ్రస్‌ లేకుండా పోయిన బాలయ్య మూవీ ఏంటో తెలుసా?

Published : Sep 29, 2025, 05:12 PM IST

కృష్ణంరాజు, బాలకృష్ణ దాదాపు నలభై ఏళ్ల క్రితం పోటీ పడ్డారు. ఆ సమయంలో రెబల్‌ స్టార్‌ మూవీ `బొబ్బిలి బ్రహ్మన్న`కి పోటీగా బాలయ్య సినిమా వచ్చి  అడ్రస్‌ లేకుండా పోయింది. 

PREV
15
కృష్ణంరాజుతో పోటీ పడి దెబ్బతిన్న బాలకృష్ణ

చిత్ర పరిశ్రమలో పోటీ అనేది సర్వసాధారణమే. పెద్ద హీరోల మధ్యనే ఈ పోటీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఒకేసారి పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు, వాటిలో రెండు సినిమాలు ఆడితే సమస్య లేదు. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హ్యాపీ. కానీ ఒక హీరో సినిమా ఆడి, మరో హీరో మూవీ పరాజయం చెందితే, అది ఫ్యాన్స్ వార్‌కి దారితీస్తుంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఇలాంటి వారే నడుస్తోంది. అప్పట్లో థియేటర్ల వద్ద ఈ వార్‌ నడిచేది. సినిమా హాల్‌ ఉన్న సెంటర్ల వద్ద, పోస్టర్ల రూపంలో ఈ వార్‌ నడిచేది. ఇలాంటివి అందరు హీరోల విషయంలో జరిగింది. ఒక వారం ఒక హీరోదైతే, మరో వారం మరో హీరోది. అయితే నాలభై ఏళ్ల క్రితం ఇలాంటి వార్‌ బాలకృష్ణ, కృష్ణంరాజు మధ్య నెలకొంది. ఆ సమయంలో కృష్ణంరాజు మూవీ దెబ్బకి బాలయ్య సినిమా అడ్రస్‌ లేకుండా పోయింది. ఎలాగైనా ఫస్ట్ హిట్‌ కొట్టాలన్నా బాలయ్య ఆశలను తలక్రిందులు చేశారు కృష్ణంరాజు. మరి ఆ సినిమాలేంటో చూద్దాం.

25
`బొబ్బిలి బ్రహ్మన్న`తో కృష్ణంరాజుసంచలన విజయం

రెబల్‌ స్టార్‌గా టాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న కృష్ణంరాజు 1966లో `చిలకా గోరింక` చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బిజీ హీరో అయిపోయారు. రెండు మూడేళ్లలోనే కృష్ణంరాజు లైఫ్‌ టర్న్ తీసుకుంది. 1970లో ఆయన స్టార్‌ హీరోగా ఎదిగారు. 1980లో సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. పలు ఇండస్ట్రీ హిట్లు అందుకున్నారు. అలా 1984లో `బొబ్బిలి బ్రహ్మన్న` చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ని అందుకున్నారు కృష్ణంరాజు. ఈ చిత్రంలో శారద, జయసుధ హీరోయిన్లుగా నటించారు. ఇందులో కృష్ణంరాజు ద్విపాత్రాభినయం చేశారు. ఊరు పెద్ద బ్రహ్మన్నగా, తమ్ముడు రవిగా నటించి మెప్పించారు. విలేజ్‌ బ్రాక్‌ డ్రాప్‌లో సాగే చిత్రమిది. విలేజ్‌ యాక్షన్‌ డ్రామాగా ఆద్యంతం రక్తికట్టిస్తుంది.

35
ఎన్నో సినిమాలకు `బొబ్బిలి బ్రహ్మన్న` ఆదర్శం

1984 జులై 19న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఆ సమయంలో కృష్ణంరాజు హీరోగా పీక్‌లో ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ సినిమాని చూసి ఊగిపోయారు. జమీందార్‌ ఫ్యామిలీకి చెందిన హీరో ఊరి పెద్దగా  రాణిస్తుండటం, పోలీస్‌ అనే వాళ్లే రాకుండా ఆ పెద్ద కనుసన్నాల్లోనే ఊరు నడవడం అనే పాయింట్‌ ఆడియెన్స్ కి మతిపోగొట్టింది. చాలా పవర్‌ఫుల్‌ గా ఆ పాత్ర ఉండటంతో ఫ్యాన్స్ బాగా ఎంజాయ్‌ చేశారు. కృష్ణంరాజు సైతం ఇరగదీశారు. దీంతో సినిమాకి జనం బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం చాలా సెంటర్లలో ఏకంగా 175 రోజులు ఆడింది. ఆ సమయంలో ఇదొక ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం విశేషం. భారీ ఎత్తుని సక్సెస్‌ సెలబ్రేషన్‌ నిర్వహించారు. దీనికి బాలీవుడ్‌, కోలీవుడ్‌ దిగ్గజ నటులు హాజరయ్యారు. అంతేకాదు ఈ సినిమా కథ స్ఫూర్తితో, ఇలా ఊరి పెద్ద కాన్సెప్ట్ తో ఆ తర్వాత ఎన్నో సినిమాలు వచ్చాయి. `బలరామకృష్ణులు`, `చిన్నరాయుడు`, `బొబ్బిలి సింహం`, `పెదరాయుడు`, `కొండవీటి సింహాసనం` వంటి చిత్రాలన్నీ ఈ మూవీని స్పూర్తిగా తీసుకునే రావడం, సక్సెస్‌ కావం విశేషం.

45
కృష్ణంరాజుకి పోటీగా వచ్చిన బాలయ్య `జననీ జన్మభూమి`

ఇక `బొబ్బిలి బ్రహ్మన్న` విడుదలైన వారం గ్యాప్‌తో బాలకృష్ణ నటించిన `జననీ జన్మభూమి` విడుదలైంది. ఈ చిత్రానికి కె విశ్వనాథ్‌ దర్శకుడు కావడం విశేషం. ఇందులో సుమలత హీరోయిన్‌గా నటించింది. కైకాల సత్యనారాయణ, శుభలేఖ సుధాకర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ 1984 జులై 27న విడుదలైంది. కానీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం చెందింది. అసలే మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. అప్పటికే థియేటర్లలో కృష్ణంరాజు `బొబ్బిలి బ్రహ్మన్న` మూవీ రచ్చ చేస్తోంది. దీంతో ఆ ప్రభావం బాలయ్య మూవీపై గట్టిగా పడిందని చెప్పొచ్చు. జనం ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. `బొబ్బిలి బ్రహ్మన్న` సునామీ ముందు బాలయ్య `జననీ జన్మభూమి` అడ్రస్‌ లేకుండా పోయింది.

55
అడ్రస్‌ లేకుండాపోయిన బాలయ్య మూవీ

అప్పటికే వరుస ఫ్లాపుల్లో ఉన్నారు బాలయ్య. ఇంకా చెప్పాలంటే ఆయనకు సోలోగా హిట్‌ లేదు. 1974లో తండ్రి ఎన్టీఆర్‌ నటించిన `తాతమ్మ కల` చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యారు బాలయ్య. దాదాపు పదేళ్ల వరకు తండ్రి సినిమాల్లోనే సెకండ్‌ లీడ్‌గా, కీలకపాత్రలు పోషిస్తూ వచ్చాడు. 1984లోనే `సాహసమే జీవితం` అనే సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత `డిస్కో కింగ్‌` చిత్రంతో వచ్చాడు. ఇది జూన్‌ 7న విడుదలైంది. అంటే `జననీ జన్మభూమి`కి నెల రోజులముందే. ఈ సినిమా కూడా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన `జననీ జన్మభూమి` సైతం చేదు అనుభవాన్ని మిగిల్చింది. రెండు నెలల తర్వాత `మంగమ్మ గారి మనవడు` సినిమా విడుదలయ్యింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. ఈ సినిమాతోనే బాలయ్య సోలో హీరోగా తొలి బ్రేక్‌ అందుకున్నారు. ఆ తర్వాత గాడిన పడ్డాడు. అప్పటికీ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సీఎం కూడా అయిపోయారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories