October Movie Releases: అక్టోబర్ బిగ్ బాక్స్ ఆఫీస్ వార్.. రజినీ, విజయ్ దేవరకొండ, అజయ్ దేవగన్ రేసులో నిలిచేది ఎవరు?

Published : Oct 02, 2026, 08:06 AM IST

October Movie Releases: పండుగల సీజన్ తో అక్టోబర్ నెల బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ భారీ చిత్రాలతో సంచలనం సృష్టించబోతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ దేవరకొండ, అజయ్ దేవగన్ వంటి స్టార్లు క్రేజీ ప్రాజెక్ట్‌లతో పోటీ పడనున్నారు.

PREV
16
అక్టోబర్ థియేటర్స్ షేక్.. ఈ నెల రిలీజ్ అవుతున్న 9 మైండ్ బ్లోయింగ్ సినిమాలు

అక్టోబర్ నెల సినిమా ప్రేమికులకు భారీ విందు అందించబోతోంది. బాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమాతో పాటు హాలీవుడ్ నుంచి క్రేజీ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. మోస్ట్ అవైటెడ్ మూవీ 'దృశ్యం: ది కంక్లూజన్'తో ప్రారంభమయ్యే ఈ నెల, యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, పీరియడ్ డ్రామాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. రజినీకాంత్ జైలర్ 2, విజయ్ దేవరకొండ రష్మిక మందన్నల రణబలి, టామ్ క్రూజ్ డిగ్గర్ వంటి భారీ చిత్రాలు ఈ అక్టోబర్‌లో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. మరి ఈ అక్టోబర్‌లో మీరు థియేటర్లలో చూడాల్సిన ఆ 9 టాప్ సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం.

26
అక్టోబర్ 2: దృశ్యం 3, హాలీవుడ్ మూవీ డిగ్గర్ సందడి

దృశ్యం: ది కంక్లూజన్

అక్టోబర్ నెల థియేట్రికల్ లైన్-అప్‌ను దృశ్యం 3 మూవీ ప్రారంభిస్తోంది. త్రిల్లర్ సిరీస్ లో మూడో భాగమైన ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మళ్లీ విజయ్ సల్గాంకర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయనతో పాటు టబు, శ్రియా శరణ్, జైదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో విజయ్ సల్గాంకర్ కథ ముగింపునకు రానుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.

డిగ్గర్

ఆస్కార్ విన్నర్ దర్శకుడు అలెజాండ్రో గొంజాలెజ్ ఇన్యారితూ దర్శకత్వంలో హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ నటిస్తున్న డిఫరెంట్ మూవీ 'డిగ్గర్'. ఇది ఒక డార్క్ కామెడీ డ్రామా. ఈ సినిమాలో రిజ్ అహ్మద్, జాన్ గుడ్‌మ్యాన్, సాండ్రా హుల్లర్, జెస్సీ ప్లెమన్స్ కూడా నటించారు. ఒక పవర్ ఫుల్ ఆయిల్ టైకూన్ చేసిన పనుల వల్ల ప్రమాదం ముంచుకొస్తే, దాని నుంచి బయటపడటానికి అతను చేసే ప్రయత్నాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలోకి వస్తోంది.

36
అక్టోబర్ 9: ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ ఉడ్తా తీర్

ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ కాంబినేషన్‌లో వస్తున్న స్పై కామెడీ మూవీ 'ఉడ్తా తీర్'. ఇండియాలో ఒక మిషన్‌లో ఉన్నప్పుడు జ్ఞాపకశక్తి కోల్పోయే పాకిస్తానీ గూఢచారి పాత్రలో ఆయుష్మాన్ ఖురానా కనిపిస్తారు. సుహైల్ నయ్యర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. గూఢచర్యాన్ని కామెడీతో మిక్స్ చేసి తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 9న విడుదల కానుంది.

46
అక్టోబర్ 15: రజినీకాంత్ మాస్ మేనియా జైలర్ 2

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్న మచ్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2. 2023లో వచ్చిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఇది సీక్వెల్. అక్టోబర్‌లో వస్తున్న బిగ్గెస్ట్ సౌత్ ఇండియన్ రిలీజ్స్‌లో ఇది ఒకటి. ఇందులో రజినీకాంత్ ముత్తువేల్ పాండియన్‌గా తిరిగి రానున్నారు. విష్ణు విశాల్, మమితా బైజూ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ చిత్రం అక్టోబర్ 15న థియేటర్లలో సందడి చేయనుంది.

56
అక్టోబర్ 16: రణబలి, ప్రహార్, స్ట్రీట్ ఫైటర్, రఫ్తార్ రిలీజెస్

రణబలి

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మళ్లీ కలిసి నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా రణబలి. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆర్నాల్డ్ వోస్లూ కూడా నటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ దసరా పండుగ సీజన్‌లో ఇదొక పెద్ద రిలీజ్ కానుంది.

ప్రహార్: ది ఉజ్వల్ నికమ్ స్టోరీ

ప్రసిద్ధ లాయర్ ఉజ్వల్ నికమ్ బయోపిక్‌గా రూపొందిన చిత్రం 'ప్రహార్: ది ఉజ్వల్ నికమ్ స్టోరీ'. 26/11 కసబ్ కేసు విచారణపై ప్రధానంగా దృష్టి సారించిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు లాయర్ ఉజ్వల్ నికమ్ పాత్రను పోషించారు. వామికా గబ్బి, సికందర్ ఖేర్, జైదీప్ కూడా నటించిన ఈ బయోగ్రాఫికల్ డ్రామా అక్టోబర్ 16న విడుదలవుతోంది.

స్ట్రీట్ ఫైటర్

పాపులర్ వీడియో గేమ్ ఫ్రాంచైజీ ఆధారంగా వస్తున్న లైవ్-యాక్షన్ అడాప్టేషన్ 'స్ట్రీట్ ఫైటర్'. క్యాప్‌కామ్ వీడియో గేమ్ సిరీస్ ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో నోవా సెంటినియో, ఆండ్రూ కోజి, కాలినా ల్యాంగ్, జేసన్ మోమోవా, విద్యుత్ జమ్వాల్ నటించారు. ఈ యాక్షన్ మూవీ అక్టోబర్ 16న థియేటర్లలోకి రానుంది.

రఫ్తార్

రాజ్‌కుమార్ రావు, కీర్తి సురేష్ కాంబినేషన్‌లో వస్తున్న హిందీ చిత్రం 'రఫ్తార్'. అక్టోబర్ పండుగ సీజన్ సందర్భంగా రిలీజ్ కానున్న హిందీ చిత్రాలలో ఇది ఒకటి. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 16న థియేటర్లలోకి రానుంది.

66
అక్టోబర్ 23: కొరియన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ హోప్

దర్శకుడు నా హాంగ్-జిన్ తెరకెక్కించిన కొరియన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'హోప్' అక్టోబర్ 23న భారతదేశంలో విడుదల కానుంది. హ్వాంగ్ జంగ్-మిన్, జో ఇన్-సంగ్, జంగ్ హో-యోన్, మైఖేల్ ఫాస్‌‌బెండర్, అలిసియా వికాండర్, టేలర్ కిచ్ ఈ చిత్రంలో నటించారు. ఒక మారుమూల పోర్ట్ టౌన్‌లో గుర్తుతెలియని వస్తువు లభించిన తర్వాత ఎదురయ్యే వింత పరిస్థితుల చుట్టూ ఈ కథ నడుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories