ట్రెడిషనల్ లుక్ లో ‘టైగర్ నాగేశ్వర రావు’ బ్యూటీ.. ఎల్లో డ్రెస్ లో కట్టిపడేస్తున్న స్టార్ హీరోయిన్ చెల్లెలు..

First Published | Oct 10, 2023, 10:33 AM IST

యంగ్ బ్యూటీ నుపూర్ సనన్ ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తోంది. బ్యూటీఫుల్ గా మెరిసి కుర్రాళ్లను మంత్రముగ్దులను చేస్తోంది. తను నటించిన తొలిచిత్రం రిలీజ్ కాబోతుండటంతో లేటెస్ట్ పిక్స్ తో ఆకట్టుకుంటోంది.
 

బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్ (Nupur Sanon)  త్వరలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు ఈమె కావడం విశేషం. కృతి సనన్ రీసెంట్ గా ‘ఆదిపురుష్’తో అలరించింది. ఇప్పుడు చెల్లెలు అలరించబోతోంది.
 

నుపూర్ సనన్ నటించిన తొలిచిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. మాస్ మహారాజా రవితేజ సరసన నటిస్తోంది.  ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తోంది. రవితేజ, నుపూర్ సనన్  ప్రచార కార్యక్రమాలో పాల్గొంటున్నారు. 


రీసెంట్ గా ముంబైలో నిర్వహించి ఈవెంట్ లో ఈ ముద్దుగుమ్మ ఎల్లో డ్రెస్ లో తళుక్కున మెరిసింది. యంగ్ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అమ్మడు అందాలకు మంత్రముగ్ధులవుతున్నారు. లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 

సౌత్ ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా నుపూర్ సనన్ Tiger Nageswara Rao  ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లో మెరిసి, మైమరిపించే ఫోజులతో మెస్మరైజ్ చేసింది. కిర్రాక్ స్టిల్స్ తో కట్టిపడేసింది. 
 

తెలుగు ప్రేక్షకులు, మాస్ మహరాజా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్  బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ గా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. రవితేజ తొలి పాన్ ఇండియా చిత్రమిది. అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 

ఈ చిత్ర హీరోయిన్ గా బాలీవుడ్ సింగర్, నటి నుపుర్ సనన్ (Nupur Sanon)   పరిచయం అవుతున్న విషయం విషయం తెలిసిందే. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం తర్వాత నుపూర్ సనన్ బాలీవుడ్ లో ‘నూరనీ చెహ్రా’ అనే చిత్రంలో నటించబోతోంది. 
 

Latest Videos

click me!