నిద్రమూడ్‌లో ఉన్నప్పుడు పడేల్‌మని కొట్టిపోతున్నాడు.. కొడుకు అభయ్‌ రామ్‌ కొంటె పనులు చెబుతూ ఎన్టీఆర్‌ ఆవేదన

Published : Jun 17, 2024, 07:35 AM IST

ఎన్టీఆర్‌.. అంటేనే కొంటె. అవే లక్షణాలు కొడుకు అభయ్‌ రామ్‌కి వచ్చాయట. రాజమౌళి, కొరటాల ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు ఎన్టీఆర్‌.  

PREV
15
నిద్రమూడ్‌లో ఉన్నప్పుడు పడేల్‌మని కొట్టిపోతున్నాడు.. కొడుకు అభయ్‌ రామ్‌ కొంటె పనులు చెబుతూ ఎన్టీఆర్‌ ఆవేదన

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బేసిక్‌గా చాలా ఎనర్జిటిక్‌. చలాకీగా ఉంటాడు. కొంటెపనులు కూడా ఎక్కువే. చిన్నప్పట్నుంచి ఆయన కొంటె పనులకు వాళ్లమ్మ బాగా ట్రీట్‌మెంట్‌ ఇచ్చేదని చెబుతున్నాడు తారక్‌. ఈ క్రమంలో ఓ సందర్భంలో తన కాలు ఇరగ్గొట్టిందని వెల్లడించాడు ఎన్టీఆర్‌. 
 

25

ఇప్పుడు తన కొంటె పనులను కొడుకు అభయ్‌ రామ్‌ వచ్చాయని చెప్పారు తారక్‌. అభయ్‌ రామ్‌ సౌమ్యుడు తనలాగా అంటూ సెటైరికల్‌గా ఆ విషయాలను వెల్లడించారు. అంతేకాదు ఆయన చేసే కొంటె పనులు బయటపెట్టాడు. రాజమౌళి, కొరటాల శివ ముందు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన `మీలో ఎవరు కోటీశ్వరుడు` అనే షో నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి కొరటాల, రాజమౌళి గెస్ట్ లుగా హాజరయ్యారు. వారి ముందు తనకొడుకులు చేసే కొంటె పనులు  బయటపెట్టాడు ఎన్టీఆర్‌.
 

35

పిల్లలు ఇద్దరు భార్గవ్‌ రామ్‌, అభయ్‌ రామ్‌లు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటారట. తాను నిద్రలో ఉన్నప్పుడు వాళ్లు సడెన్‌గా వస్తారట, పడేల్‌మని కొట్టిపోతారట. ఇద్దరిలో ఎవరని ఎంక్వౌరీ చేస్తే అభయ్‌ గాడని తెలిసిందట. ఇది విని అభయ్‌ రామే ఇదే చేస్తాడని అన్నారు కొరటాల. అభయే అంటూ తారక్‌ కూడా చెప్పాడు. ఈసందర్భంగా ఆయన అసలు రూపం బయటపెట్టాడు. 
 

45

అభయే ఇలాంటి పనులు చేస్తాడని, అతను చాలా సౌమ్యుడు, నాలా అంటూ తనపై తాను సెటైర్లు వేసుకున్నాడు. ఇక భార్గవ్‌ ప్రణతిలాగా కాస్త హైపర్‌ అనేలా చెప్పాడు ఎన్టీఆర్‌. దానికి రాజమౌళి ఆ ఆ అవును అవును అంటూ అదోలా తల ఊపారు. దానికి అంతే కదా అంతేకదా.. అంటూ రాజమౌళిని బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో ఏంటి బెదిరిస్తున్నావా? అంటూ రాజమౌళి చెప్పడం విశేషం. 
 

55

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది.జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్‌ 27న విడుదల కాబోతుంది. మరోవైపు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `వార్‌ 2`లో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటిస్తున్నారు.ఇందులో ఆయనది నెగటివ్‌ రోల్‌ అని తెలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories