కానీ జక్కన్న దర్శకత్వంలో విడుదలైన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటించి ఎనలేని క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటించగా ఆయన కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. మొత్తానికి ఈ ఇద్దరు స్టార్ హీరోల జీవితాలు ఆర్ఆర్ఆర్ తో మలుపు తిరిగాయనే చెప్పవచ్చు.