NTR: లక్ష్మీ ప్రణతి తన జీవితంలోకి రావడంలో ఎన్టీఆర్‌లో వచ్చిన మార్పు ఇదే.. ఆ విషయంలో వీక్‌ అయిపోయాడా?

Published : Mar 23, 2026, 12:45 PM IST

ఎన్టీఆర్‌ ఫుల్‌ ఎనర్జిటిక్‌. సెట్‌లో ఆయన ఉంటే మొత్తం సందడి సందడిగా ఉంటుందట. అయితే పెళ్లి తర్వాత మాత్రం ఆయన ఒక విషయంలో వీక్‌ అయ్యాడు. దాన్ని ఎన్టీఆర్‌ బయటపెట్టాడు. 

PREV
15
డ్రాగన్‌ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా హీరోగా రాణిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` తో ఆయన రేంజ్‌ మారిపోయింది. `దేవర`తో తానేంటో నిరూపించారు. ఇప్పుడు `డ్రాగన్‌`తో సత్తా చాటేందుకు వస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ చిత్రమిది. 1970 కోల్‌ కత్తా బ్యాక్‌ డ్రాప్‌లో సాగే ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాకి భారీగా ఖర్చు చేస్తున్నారట. యాక్షన్‌ సీన్లు అదిరిపోతాయని ఇటీవల నిర్మాత నవీన్‌ యెర్నేని వెల్లడించారు.

25
పెళ్లి తర్వాత ఇంటికే పరిమితమవుతున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్‌.. 2011లో లక్ష్మీ ప్రణతితో పెళ్లి అయ్యింది. ఆమె తన చుట్టాల్లో దూరపు బంధువు. పెళ్లికి ముందు పెద్దగా తెలియదట, కానీ పెళ్లి అయ్యాక మాత్రం ఆమె లేకపోతే ఎన్టీఆర్‌ లేడు అనేంతగా వారి మధ్య బాండింగ్‌ ఏర్పడిందట. వీరి ప్రేమకి, పెళ్లి బంధానికి ప్రతిఫలంగా ఇద్దరు కుమారులు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌ జన్మించారు. ఎన్టీఆర్‌ చాలా వరకు ఫ్యామిలీకే టైమ్ కేటాయిస్తారు. వెళితే షూటింగ్‌కి, లేదంటే ఇంటికే పరిమితం అనేలా ఉంటారు. పిల్లలతో ఎక్కువగా టైమ్‌ స్పెండ్‌ చేస్తారని ఎన్టీఆర్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

35
పెళ్లి తర్వాత ఎన్టీఆర్‌ భయపడుతున్నాడా?

ఈ క్రమంలో పెళ్లి తర్వాత తనలో వచ్చిన మార్పుని, లక్ష్మీ ప్రణతి తన లైఫ్‌లోకి వచ్చాక వచ్చిన మార్పుని ఎన్టీఆర్‌ వెల్లడించారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. పెళ్లి తర్వాత కొన్ని విషయాల్లో వీక్‌ అయ్యాడట. రిస్క్ చేయాలంటే భయపడుతున్నాడట. దీనిపై తారక్‌ మాట్లాడుతూ, `పెళ్లికి ముందు జీవితం గురించి పెద్దగా పట్టించుకునే వాడిని కాదు, రిస్క్ సన్నివేశాలు చేసేటప్పుడు దేని గురించీ ఆలోచించే వాడిని కాదు, కానీ ప్రణతి నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఏదో బంధం నన్ను లాగుతున్నట్టు అనిపిస్తోంది` అని తెలిపారు ఎన్టీఆర్‌.

45
లక్ష్మీ ప్రణతితో విడిదీయలేని బంధం ఏర్పడింది -ఎన్టీఆర్

ఆయన ఇంకా మాట్లాడుతూ, ఇంట్లో ఒకరు నా కోసం ఉన్నారు, వాళ్ల కోసమైనా ఆలోచించాలి అనే భావన వచ్చేసింది. ప్రణతి దూరపు బంధువే అయినా పెళ్లికి ముందు అంతగా కలవలేదు, ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కానీ పెళ్లైన తర్వాత మా మధ్య విడదీయలేని బంధం పెనవేసుకున్నది. మన వివాహ వ్యవస్థలో ఉన్న గొప్పతనం ఇదే` అని వెల్లడించారు ఎన్టీఆర్‌. పెళ్లికి ముందు ఎలాంటి రిస్క్ అయిన చేసేవాడిని అని, కానీ ఇప్పుడు భయపడాల్సి వస్తుంది, ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుందని తెలిపారు. ఈ విషయంలో తాను వీక్‌ అయిపోయినట్టు తెలిపారు ఎన్టీఆర్‌. పెళ్లైన తర్వాత `ఊసరవెళ్లి` సినిమా టైమ్‌లో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.

55
లక్ష్మీ ప్రణతి బ్యాక్‌ గ్రౌండ్‌

2011 మే 11న ఎన్టీఆర్‌, లక్ష్మీ ప్రణతి వివాహం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త, రియాల్టర్‌ నార్నే శ్రీనివాసరావు కూతురు లక్ష్మీ ప్రణతి. ప్రణతి సోదరుడు నార్నే నితిన్‌ ఇటీవల సినిమాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. `మ్యాడ్‌`, `మ్యాడ్‌ 2` చిత్రాల్లో నటించాడు. రెండూ బ్లాక్‌ బస్టర్‌ అయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నారు నవీన్‌. ఇక లక్ష్మీ ప్రణతి పిల్లల్ని చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories