Dhurandhar 2 Day 4 Box Office: ఐదో రోజు డీలా పడ్డ 'ధురంధర్ 2', 4 రోజుల్లో బాహుబలి 2 రికార్డ్ బ్రేక్‌

Published : Mar 23, 2026, 11:16 AM IST

Dhurandhar 2 Day 4 Box Office: ఫస్ట్ వీకెండ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'ధురంధర్: ది రివెంజ్'.. మొదటి సోమవారం వచ్చేసరికి స్లో అయిపోయింది. వీకెండ్, సెలవు రోజు కాకపోవడంతో కలెక్షన్లు తగ్గాయి. మరి 'ధురంధర్ 2' 4 రోజుల కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం.   

PREV
16
మొదటి సోమవారం స్లో అయిన 'ధురంధర్ 2'
రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ డ్రామా 'ధురంధర్ 2' మొదటి వీకెండ్‌లో సుమారు రూ.454.12 కోట్లు వసూలు చేసింది. ఒక్క హిందీ వెర్షన్‌లోనే రూ.430 కోట్లు రాబట్టింది. నాలుగు రోజుల్లో మూడు రోజులు వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కానీ, వీకెండ్ ముగియగానే సోమవారం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా స్లో అయిపోయింది.
26
'ధురంధర్ 2' ఐదో రోజు కలెక్షన్ ఎంత?

ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ sacnilk.com రిపోర్ట్ ప్రకారం, 'ధురంధర్: ది రివెంజ్' ఐదో రోజు, అంటే మొదటి సోమవారం నాడు సుమారు రూ.3.13 కోట్లు (ఉదయం 10 గంటల వరకు) వసూలు చేసింది. ఇందులో హిందీ బెల్ట్‌లో ఈ సినిమా దాదాపు రూ.2.89 కోట్లు సంపాదించింది.

36
'ధురంధర్ 2' ఐదు రోజుల మొత్తం కలెక్షన్

మొత్తం 5 రోజుల్లో 'ధురంధర్ 2' దేశీయ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.457.25 కోట్లు (సోమవారం ఉదయం 10 గంటల వరకు) వసూలు చేసింది. కేవలం హిందీ వెర్షన్ కలెక్షన్లే రూ.432.89 కోట్లకు చేరాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ.691కోట్లు రాబట్టింది. 5వ రోజుతో 700కోట్లని దాటబోతుంది.

46
ధురంధర్ 2 రోజువారీ కలెక్షన్ల వివరాలు(ఇండియా బాక్సాఫీసు)
  • ప్రీమియర్: రూ.43 కోట్లు
  • మొదటి రోజు: రూ.102.55 కోట్లు
  • రెండో రోజు: రూ.80.72 కోట్లు
  • మూడో రోజు: రూ.113 కోట్లు
  • నాలుగో రోజు: రూ.114.85 కోట్లు
  • ఐదో రోజు: రూ.3.13 కోట్లు

మొత్తం కలెక్షన్: రూ.457.25 కోట్లు

56
'ధురంధర్ 2' బడ్జెట్ ఎంత?

 ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్: ది రివెంజ్' సినిమాను సుమారు రూ.225 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ లెక్కన చూస్తే, ఈ సినిమా ఇప్పటికే రూ.232 కోట్లకు పైగా లాభం సంపాదించింది. అంటే పెట్టిన బడ్జెట్‌పై 103 శాతానికి పైగా రిటర్న్స్ వచ్చాయన్నమాట. కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కేటగిరీలోకి చేరిపోయింది.

66
బాహుబలి 2 నాలుగు రోజుల రికార్డుని బ్రేక్‌ చేసిన ధురంధర్‌ 2

ఇక ధురంధర్‌ 2 బాక్సాఫీసు వద్ద ర్యాంపేజ్‌ ఆడుతోంది. ఈ చిత్రం నాలుగు రోజుల కలెక్షన్లు చూస్తే, ఇప్పటికే `ఆర్‌ఆర్‌ఆర్‌`, `జవాన్‌` మూవీ వసూళ్లని బ్రేక్‌ చేసింది. ఇప్పుడు `బాహుబలి 2` రికార్డుని కూడా బ్రేక్‌ చేయడం విశేషం. బాహుబలి 2 సినిమాకి నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.625కోట్లు వచ్చాయి. కానీ ధురంధర్‌ 2కి నాలుగు రోజుల్లో ఏకంగా రూ.691కోట్లు రావడం విశేషం. అయితే ఇది ఇంకా `పుష్ప 2`ని బ్రేక్‌ చేయలేకపోయింది. లాంగ్‌ రన్‌లో దాటేస్తుందా అనేది చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories