RRR Highlights Leak: ఎన్టీఆర్‌ టైగర్‌ ఫైట్‌, రామ్‌చరణ్‌ ఎంట్రీ, ఆ 40 నిమిషాలు.. పూనకాలు తెప్పించేవి ఇవే ?

Published : Mar 09, 2022, 02:17 PM ISTUpdated : Mar 09, 2022, 02:20 PM IST

యావత్‌ ఇండియన్‌ సినీ ప్రియులంతా వెయిట్‌ చేస్తున్న సినిమా `ఆర్‌ఆర్‌ఆర్‌`. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రధానంగా ఆరు ఎలిమెంట్లు ఆడియెన్స్ కి గూస్‌బమ్స్ తెప్పించేలా ఉంటాయట. అవే సినిమాకి హైలైట్‌ అని తెలుస్తుంది. 

PREV
16
RRR Highlights Leak: ఎన్టీఆర్‌ టైగర్‌ ఫైట్‌, రామ్‌చరణ్‌ ఎంట్రీ, ఆ 40 నిమిషాలు.. పూనకాలు తెప్పించేవి ఇవే ?

ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram Charan) హీరోలుగా రాజమౌళి(Rajamouli) రూపొందిస్తున్న మల్టీస్టారర్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie). అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలివీయా మోర్రీర్‌ కథానాయికగా నటిస్తుండగా, ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం ఆడియెన్స్ అంతా ఆసక్తికరంగా, ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. సినిమాపై అంచనాలకు కూడా ఆకాశమే హద్దుగా ఉంది. అయితే సినిమా నాలుగు సార్లు వాయిదా పడటంతో కాస్త నిరాశలో ఉన్నారు ఫ్యాన్స్. 

26

మరోవైపు చిత్ర బృందం కూడా డిజాప్పాయింటింగ్‌గా ఉంది. అయినా చివరి ప్రయత్నంగా సినిమాపై అంచనాలు పెంచేందుకు త్వరలో ప్లాన్‌ చేస్తున్నారు. భారీగానే ప్రమోషన్స్ ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన హైలైట్స్ లీక్‌ అవడం విశేషం. ప్రస్తుతం నెట్టింట ప్రధానంగా ఆరు ఎలిమెంట్లు సినిమాకి ప్రాణమని అంటున్నారు అభిమానులు. వాటిని పంచుకుంటూ సినిమాపై అంచనాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. RRR Highlights.

36

వీటిలో ఎన్టీఆర్‌ టైగర్‌ ఫైట్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో బెస్ట్ ఎపిసోడ్‌గా ఉండబోతుందట. ఇది కనీ విని ఎరుగని రీతిలో డిజైన్‌ చేశారట రాజమౌళి. ఎన్టీఆర్‌నే టైగర్‌గా పిలుచుకుంటారు అభిమానులు. అలాంటిది ఏకంగా ఎన్టీఆరే టైగర్‌తో ఫైట్‌ చేస్తూ ఊహించుకోవడానికే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటి సన్నివేశం ఇందులో ఉండబోతుంది. మరో హైలైట్‌లో రామ్‌చరణ్‌ ఎంట్రీ ఉంటుందట. మొదట ఎన్టీఆర్‌ ఎంట్రీ ఉంటుందని, ఆ తర్వాత చరణ్‌ ఎంట్రీ, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ పీక్‌లో ఉంటాయని ఆ క్షణాలు ఆడియెన్స్ సీట్‌ నుంచి లేచి చూస్తారని టాక్‌. 

46

మరోవైపు `నాటు నాటు` సాంగ్‌ ఇప్పటికే ఆడియెన్స్ ని మంత్రముగ్దుల్ని చేసింది. కానీ ఆ పాట వచ్చే సందర్భం, అందులో ఎన్టీఆర్‌, చరణ్‌ కలిసి చేసిన డాన్సులు బయట చూసిన దానికి పది రెట్లు ఉంటుందని, చాలా ఎమోషనల్‌గా, గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంటుందని లీక్‌ రాయుళ్లు చెబుతున్నారు. ఈ పాట సినిమాలో ఔట్‌ స్టాండింగ్‌గా ఉంటుందని టాక్‌. 

56

`ఆర్‌ఆర్‌ఆర్‌` క్లైమాక్స్ షాకింగ్‌గా ఉంటుందట. ఎవరూ ఊహించని విధంగా సాగుతుందని, అప్పటి వరకు సాగిన కథని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తుందని అంటున్నారు. సినిమాకి చివరి 40 నిమిషాలు ప్రాణమని, అదే ఆడియెన్స్ ని హైలో కూర్చొబెతుందని, సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్‌గా, అసెట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు నెటిజన్లు. క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుందట. ఆడియెన్స్ నెవర్‌ బిఫోర్‌ ఫీలింగ్‌ని పొందుతారని సమాచారం. 
 

66

మరోవైపు సినిమా విజువల్‌గా గ్రాండియర్‌గా ఉంటుందని ఇప్పటికే `ట్రైలర్‌లో చూశాం. అది జస్ట్ శాంపుల్‌ మాత్రమే అని, సినిమా మాత్రం విజువల్‌ వండర్‌గా, చూస్తున్నంత సేపు మరో కలర్‌ఫుల్‌ ప్రపంచాన్ని, రణరంగాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. ఈ ఎపిక్‌ యాక్షన్‌ డ్రామా ఆడియెన్స్ కి ఓ సరికొత్త అనుభూతినిస్తుందని టాక్‌. మరి ఇందులో నిజమెంతో గానీ ఇప్పుడీ వార్త నెట్టింట సంచలనంగా మారింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories