ఒకప్పుడు ఎన్టీఆర్ మనసు దోచుకున్న ఈ స్టార్ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి... షాకిస్తున్న సమీరారెడ్డి లేటెస్ట్ లుక్

Published : Sep 15, 2021, 10:49 AM IST

తెలుగు మూలాలు కలిగిన ముంబై భామ సమీరా రెడ్డి తెలుగులో హీరోయిన్ గా చేసింది కేవలం మూడు సినిమాలు మాత్రమే. అయినప్పటికీ ఆమె తెలుగు ప్రేక్షకుల మదిలో తన మార్క్ క్రియేట్ చేశారు.

PREV
110
ఒకప్పుడు ఎన్టీఆర్ మనసు దోచుకున్న ఈ స్టార్ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి... షాకిస్తున్న సమీరారెడ్డి లేటెస్ట్ లుక్

2005లో విడుదలైన నరసింహుడు చిత్రంతో సమీరా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు గోపాల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై, ప్లాప్ గా నిలిచింది. 


 

210

అదే ఏడాది చిరంజీవి హీరోగా దర్శకుడు విజయ భాస్కర్ తెరకెక్కించిన జై చిరంజీవ మూవీలో నటించారు. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అశోక్ మూవీలో మరోమారు ఎన్టీఆర్ కి జతకట్టిన సమీరా టాలీవుడ్ నుండి జండా పీకేశారు. 
 

310

ఈ క్రమంలో ఎన్టీఆర్, సమీరా రిలేషన్ పై రూమర్స్ చక్కర్లు కొట్టాయి. సమీరా ప్రేమలో ఎన్టీఆర్ పడిపోగా, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని కథనాలు వెలువడ్డాయి. పెళ్లి వరకు వెళ్లిన వీళ్ళ వ్యవహారం, పెద్దలు నిరాకరించడంతో ఆగిపోయిందనేది, అనధికారిక సమాచారం. 
 

410


చాలా గ్యాప్ తరువాత 2012లో కృష్ణం వందే జగత్గురుమ్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేశారు సమీరా రెడ్డి. 2014లో బిసినెస్ మాన్ అక్షయ్ వార్డెను వివాహం చేసుకున్న సమీరా సినిమాలకు గుడ్ బై చెప్పారు. 
 

510

కాగా బాడీ షేమింగ్ వలన చాలా అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పిన సమీరా బాడీ పాజిటివిటీపై ఆమె ప్రచారం కల్పిస్తున్నారు. నువ్వు నీలా ఉండు, ఎలా ఉన్నా మనల్ని మనం ప్రేమించుకోవాలని ఆమె పూర్తిగా నమ్ముతున్నారు.

610

ఇదే విషయాన్ని బలపరుస్తూ ఆమె తన డీగ్లామర్ లుక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు ఆసక్తికర వివరణ ఇచ్చారు. 
 

710


సమీరా తన వైట్ హెయిర్ కి కలర్ వేయకుండా సహజంగా కనిపించడం ఆమె తండ్రిని ఆందోళనకు గురి చేసిందట. ఆమె వయసు పట్ల జనాలు నెగిటివ్ కామెంట్స్ చేస్తారని ఆయన బాధపడ్డారట. 

810

వైట్ హెయిర్ కవర్ చేసుకోవచ్చు కదా.. అని సమీరా ఫాదర్ ఆమెను అడుగగా... జనాలు తాను అందంగా లేనని, ముసలి దానినని అనుకుంటే మాత్రం నష్టం ఏముంది. నేను నాలానే ఉంటాను. 
 

910


నా మనసుకు నచ్చినప్పుడు జుట్టుకు కలర్ వేసుకుంటాను. ఇతరుల కోసం కాకుండా నాకోసం నేను బ్రతుకుతాను. ఎలా ఉన్నా నన్ను నేను ప్రేమిస్తాను అంటూ ఆమె సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. 

1010


మొదటి కాన్పు తరువాత సమీరా బాగా లావయ్యారట. ఆ సమయంలో ఆమె విపరీతమైన బాడీ షేమింగ్ ని ఎదురుకున్నారట. ఆ విషయాన్ని స్వయంగా వెల్లడించిన సమీరా, బాడీ షేమింగ్ కి వ్యతిరేకంగా ఆమె క్యాంపైన్ చేస్తున్నారు. 
 

click me!

Recommended Stories