హాలీవుడ్‌ ఎంట్రీపై ఎన్టీఆర్‌ క్లారిటీ.. `కేజీఎఫ్‌` డైరెక్టర్‌తో సినిమా.. ఫ్యాన్స్ కి గూస్‌బమ్సే..

First Published May 12, 2021, 7:05 PM IST

ఎన్టీఆర్‌ ఇంట్రెస్టింగ్‌ విషయాలను పంచుకున్నారు. హాలీవుడ్‌ ఎంట్రీపై ఆయన క్లారిటీ ఇచ్చారు. `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌తో సినిమాని కన్ఫమ్‌ చేశాడు. ఫ్యాన్స్ గూస్‌బమ్స్ తెచ్చేవిషయాలను షేర్‌ చేసుకున్నారు తారక్‌. 

ఎన్టీఆర్‌కి ఇటీవల కరోనా నిర్ధారణ అయ్యింది. తాను వైరస్‌ బారిన పడ్డట్టు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తాను, ఫ్యామిలీ హోం ఐసోలేట్‌ అయినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. ఆయన ఆరోగ్యంపై చిరంజీవి కూడా స్పందించిన విషయం తెలిసిందే.
undefined
ఇదిలా ఉంటే తాజాగా ఓ టీవీ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఎన్టీఆర్‌. ఇందులో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` గురించి, హాలీవుడ్‌ ఎంట్రీ గురించి, నెక్ట్స్ సినిమాల గురించి, అలాగే నిర్మాణం గురించి ఆయన ఇంట్రెస్టింగ్‌ విషయాలను షేర్‌ చేసుకున్నారు.
undefined
2018లోనే `ఆర్‌ఆర్‌ఆర్‌` వర్క్ స్టార్ట్ అయ్యిందన్నారు. రాజమౌళి పర్‌ఫెక్షన్‌కి మారుపేరని, అందుకే సినిమాలు ఆలస్యమవుతాయని చెప్పారు. ఈ సినిమా మేజర్జీ భాగం పూర్తయ్యిందన్నారు. కరోనా వల్ల వాయిదా పడిందని చెప్పారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`లో తన పాత్ర గురించి చెబుతూ, నిజమైన హీరోల గురించి దేశ వ్యాప్తంగా చెప్పాల్సిన అవసరం ఉందని, ఇందులో తాను నటించి కొమురంభీమ్‌ పాత్ర కోసం చాలా రీసెర్చ్ చేశారట. ఆయా విషయాలను తమ పిల్లలకి కూడా చెబుతున్నట్టు తెలిపారు.
undefined
కొమరం భీమ్ పాత్ర కోసం ఆయన ఎంత కష్టపడ్డారో వివరించారు. దాదాపు 18నెలలు భీమ్ లుక్ కోసం ఎన్టీఆర్ కఠిన కసరత్తులు చేశారట. ఆర్ ఆర్ ఆర్ కి ముందు ఎన్టీఆర్ 71 కేజీల బరువు ఉండగా, కొమరం భీమ్ పాత్ర కోసం 9కేజీల మజిల్ బాడీ పెంచాల్సి వచ్చిందట. దాని కోసం చాలా కష్టపడినట్లు ఎన్టీఆర్ తెలియజేశారు.
undefined
దర్శకత్వం చేయాలనే ఆలోచన గురించి చెబుతూ, దర్శకత్వంపై ఆసక్తి లేదన్నారు. కానీ మంచి కథలను నిర్మించాలనే ఆలోచన ఉందన్నారు. గతంలో ఎన్టీఆర్‌ ప్రొడక్షన్‌ స్టార్ట్ చేయబోతున్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయా వార్తలను తారక్‌ కన్ఫమ్‌ చేశారు.
undefined
ఇక `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాని ఓటీటీలో విడుదల చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. `బాహుబలి`, `జురాసిక్‌ పార్క్`, `అవేంజర్స్ ` వంటి భారీ సినిమాలను పెద్ద తెరపైనే చూడాలని, ఆడియెన్స్ కూడా థియేటర్‌లోనే చూసేందుకు ఇష్టపడతారని, పెద్ద తెరపై సమూహంగా చూస్తూ ఆస్వాదించే సినిమా ఇదన్నారు.
undefined
హాలీవుడ్‌ ఎంట్రీ ఆలోచన ఉందా? అన్నప్రశ్నకి స్పందిస్తూ, అవకాశం వస్తే ఎవరైనా చేస్తారని, తాను కూడా ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తానని తన మనసులోని మాటని వెల్లడించారు. ఫ్యాన్స్ కి గూస్‌బమ్స్ తెచ్చే విషయాన్ని వెల్లడించారు. తన తదుపరి సినిమాల గురించి చెబుతూ, నెక్ట్స్ కొరటాల శివతో సినిమా ఉంటుందని చెప్పారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` పూర్తవగానే ఈ సినిమా స్టార్ట్ అవుతుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందన్నారు.
undefined
ఈ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌తో సినిమా ఉంటుందని చెప్పారు. అంటే ప్రభాస్‌ తర్వాత ఆయన చేస్తున్న `సలార్‌` పూర్తవగానే ప్రశాంత్‌తో ఎన్టీఆర్‌ సినిమా ఉండబోతుందని చెప్పొచ్చు. ఈ లెక్కన ఇక త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో సినిమా ఇప్పట్లో లేనట్టే అనే విషయాన్ని కన్ఫమ్‌ చేశాడు ఎన్టీఆర్‌. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నానని, కుటుంబంతో సమయం గడుపుతున్నానని, అమ్మా, భార్య, పిల్లలతో ఉండటం ఒక ఎమోషన్‌ అని, దాన్ని తానెప్పుడూ ఇష్టపడతానని చెప్పారు ఎన్టీఆర్‌.
undefined
click me!