ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తారక్ పాత ఇంటర్వ్యూ క్లిప్ చక్కర్లు కొడుతుంది. ఇందులో ఆయన లవ్, బ్రేకప్ గురించి ఓపెన్ అయ్యారు. తనకు ఎలాంటి భార్య రావాలనుకుంటున్నాడో తెలిపాడు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో
ఎన్టీఆర్ మాట్లాడుతూ, తన ప్రేమ విషయాన్ని రివీల్ చేశారు. ఆ ఏజ్‌లో ఆకర్షణకు గురయినట్టు చెప్పాడు తారక్. సినిమాని, పర్సనల్ లైఫ్‌ని మిక్స్ చేయకూడదని తాను భావిస్తానని, కానీ ఆ సమయంలో లవ్ తనని డామినేట్ చేసిందన్నారు. ఆ సమయంలో తన ఏజ్ 23 అని వెల్లడించారు ఎన్టీఆర్.