ఎన్టీఆర్ దేవరకి అనుకూలంగా 'మెగా' హీరోల సెంటిమెంట్.. ఆ ముగ్గురూ ఆల్రెడీ ప్రూవ్ చేశారుగా

First Published | Sep 11, 2024, 6:36 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మంగళవారం విడుదలైన ట్రైలర్ తో పాన్ ఇండియా వైడ్ గా దేవర చిత్రం గురించి చర్చ మొదలైంది. అయితే ఓ మెగా సెంటిమెంట్ దేవర చిత్రానికి అనుకూలంగా ఉంది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మంగళవారం విడుదలైన ట్రైలర్ తో పాన్ ఇండియా వైడ్ గా దేవర చిత్రం గురించి చర్చ మొదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ట్రైలర్ లో కొరటాల శివ ఎన్టీఆర్ ని పవర్ ఫుల్ గా చూపిస్తూనే సముద్రానికి సంబంధించిన స్టన్నింగ్ విజువల్స్ అందించారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. దీనితో అంతా కొరటాల ఎలా కంబ్యాక్ ఇస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఓ మెగా సెంటిమెంట్ దేవర చిత్రానికి అనుకూలంగా ఉంది. మెగా హీరోలకి ఫ్లాప్ చిత్రం ఇచ్చిన తర్వాత ఆ దర్శకులు నందమూరి హీరోలతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ చిత్రాలు ఏమిటో.. ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం. 


డైరెక్టర్ బాబీ.. పవన్ కళ్యాణ్ తో 2016లో సర్దార్ గబ్బర్ సింగ్ తెరకెక్కించారు. ఆ మూవీ పెద్ద డిజాస్టర్. ఆ వెంటనే బాబీ ఎన్టీఆర్ తో జై లవకుశ చిత్రం తెరకెక్కించారు. ఆ మూవీ మంచి విజయం సాధించింది. బాబీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. 

2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి చిత్రంతో పవన్ కళ్యాణ్ కి దారుణమైన ఫ్లాప్ ఇచ్చారు. అదే ఏడాది యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత చిత్రం తెరకెక్కించి సాలిడ్ గా కంబ్యాక్ ఇచ్చారు. 

బోయపాటి శ్రీను 2019లో రాంచరణ్ తో వినయ విధేయ రామ చిత్రం రూపొందించారు. ఆ మూవీ డిజాస్టర్ కావడమే కాదు.. బోయపాటికి విమర్శలు సైతం తెచ్చిపెట్టింది. ఆ తర్వాత బాలయ్యతో బోయపాటి అఖండ చిత్రం తెరకెక్కించారు. ఈ మూవీ బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 

Devara Trailer

ఇప్పుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ తో దేవర చేస్తున్నారు. మెగా హీరోలకు ఫ్లాప్..ఆ తర్వాత నందమూరి హీరోలకు హిట్ అనే సెంటిమెంట్ దేవర చిత్రానికి కూడా కలసి వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి సెప్టెంబర్ 27న ఏం జరుగుతుందో చూడాలి. 

Latest Videos

click me!