Published : May 26, 2022, 03:20 PM ISTUpdated : May 26, 2022, 03:23 PM IST
పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో ఎన్టీఆర్ రెండవ స్థానం దక్కించుకున్నాడు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ ని పక్కకు నెట్టి ఆ ప్లేస్ సాధించాడు. భారతదేశ సినిమా ప్రేమికులు ఎన్టీఆర్ టాప్ స్టార్ అని నిర్ధారించారు.
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఏడాదిలో నిర్దేశిత సమయానికి గాను పలు రంగాలకు చెందిన పాపులర్ స్టార్స్ పై అధ్యయనం చేస్తుంది. దేశవ్యాప్తంగా పోల్స్ నిర్వహించి సర్వేలో పాల్గొన్నవారి అభిప్రాయాల ఆధారంగా ర్యాంకింగ్స్ కేటాయిస్తారు. వెండితెర, బుల్లితెర నటులు, స్పోర్ట్స్ స్టార్స్ ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులపై సర్వే నిర్వహిస్తారు.
28
ఈ క్రమంలో ఏప్రిల్ 2022 వరకు టాప్ పాన్ ఇండియా స్టార్స్ పై నిర్వహించిన సర్వేలో ఎన్టీఆర్ (NTR) రెండవ స్థానం పొందారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ పాపులారిటీ దేశవ్యాప్తం కాగా ఆయన బెస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. అనూహ్యంగా కోలీవుడ్ స్టార్ విజయ్ (Vijay) ఫస్ట్ ప్లేస్ ఆక్రమించారు. ఒక్క పాన్ ఇండియా హిట్ లేకున్నా విజయ్ టాప్ పొజిషన్ అందుకోవడం చెప్పుకోదగ్గ అంశం.
38
ప్రభాస్ (Prabhas) ఈ లిస్ట్ లో 3వ స్థానం ఆక్రమించారు. ఆయన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ అనుకున్న ఫలితం ఇవ్వకున్నప్పటికీ ఆయన 3వ స్థానం దక్కించుకున్నారు. ఇక 4వ స్థానం అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. పుష్ప మూవీతో బాలీవుడ్ లో సత్తా చాటిన బన్నీ (Allu Arjun)టాప్ 5లో చోటు దక్కించుకున్నారు.
48
ఆయన తర్వాత అక్షయ్ కుమార్ 5వ స్థానం పొందారు. బాలీవుడ్ నుండి ఒక్క అక్షయ్ కుమార్ కి మాత్రమే లిస్ట్ లో చోటు దక్కింది. సల్మాన్, షారుక్, రన్బీర్, అమీర్ లలో ఒక్కరికి కూడా టాప్ టెన్ లో స్థానం దక్కలేదు. ఇది నిజంగా బాలీవుడ్ నొచ్చుకోవాల్సిన పరిణామం.
58
మరో కోలీవుడ్ స్టార్ అజిత్ 6వ స్థానం సొంతం చేసుకున్నారు. అజిత్ కూడా ఇంత వరకు పాన్ ఇండియా సక్సెస్ చూడలేదు. వలిమై హిందీ వెర్షన్ కి ఆదరణ దక్కలేదు. అయితే కోలీవుడ్ టాప్ స్టార్ గా ఆయన టాప్ టెన్ లో స్థానం దక్కించుకున్నారు.
68
ఆర్ ఆర్ ఆర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కి 7వ స్థానం దక్కింది. అల్లూరి పాత్రలో నట విశ్వరూపం చూపిన రామ్ చరణ్ కి ప్రేక్షకులు ఈ స్థానం ఇచ్చారు. ఇక కెజిఎఫ్ 2 చిత్రంతో రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన యష్ కి 8వ స్థానం దక్కింది. కెజిఎఫ్ 2 హిందీ వర్షన్ రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే.
78
9వ స్థానం హీరో సూర్య సొంతం చేసుకున్నారు. అనూహ్యంగా మహేష్ 10వ స్థానానికి పరిమితమయ్యాడు. ఇవి ఏప్రిల్ ముందు వరకు జరిగిన సర్వే ఫలితాలు. మహేష్ (Mahesh Babu)మూవీ సర్కారు వారి పాట మే నెలలో విడుదలైంది. ఈ కారణంగా మహేష్ రేసులో వెనుకబడ్డాడు. అయితే ఒక్క పాన్ ఇండియా విడుదల లేకుండా ఆ స్థాయి పాపులారిటీ రాబట్టడం విశేషం.
88
ormax
అనూహ్యంగా పవన్ కళ్యాణ్ కి టాప్ టెన్ లో చోటు దక్కలేదు. టాలీవుడ్ టాప్ స్టార్స్ నుండి ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే లిస్ట్ లో లేరు. టాలీవుడ్ టాప్ స్టార్ గా ఎన్టీఆర్ మొదటి స్థానం, పాన్ ఇండియా స్టార్స్ లో రెండో స్థానంలో నిలిచాడు.