పవన్ కి షాక్... ఎన్టీఆర్ అట్టర్ ఫ్లాప్ మూవీ ఛాయలు ఆచార్య పోలికలు... వీరమల్లు భవిష్యత్తు ఏమిటీ?

Published : May 26, 2022, 02:28 PM IST

షూటింగ్ దశలో నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొన్న చిత్రాల ఫలితాలు దారుణంగా ఉంటాయి. గతంలో పలు సందర్భాల్లో అది నిజమైంది. లేటెస్ట్ డిజాస్టర్ ఆచార్య (Acharya) మరో ఉదాహరణ. కాజల్ ని తప్పించడం, రీషూట్స్ చేయడం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న ఆచార్య టాలీవుడ్ ఆల్ టైం డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

PREV
16
పవన్ కి షాక్... ఎన్టీఆర్ అట్టర్ ఫ్లాప్ మూవీ ఛాయలు ఆచార్య పోలికలు... వీరమల్లు భవిష్యత్తు ఏమిటీ?
Hari Hara Veeramallu

ఇప్పుడు ఇదే పరిస్థితి హరి హర వీరమల్లు ఎదుర్కొంటుంది. హరిహర వీరమల్లు (Harihara Veeramallu) మూవీపై వస్తున్న పుకార్లు ఆ చిత్ర హైప్ దెబ్బతీస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ మాదిరి తమ హీరో కూడా ఓ పాన్ ఇండియా హిట్ కొట్టాలని భావిస్తున్నారు.

26
Hari Hara Veeramallu

జరుగుతున్న ప్రచారం చూస్తే వాళ్ళ కోరిక నెరవేరేలా కనిపించడం లేదు. పవన్ ఈ చిత్ర అవుట్ ఫుట్ పట్ల పూర్తి అసహనం వ్యక్తం చేశాడట. 50 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న హరిహర వీరమల్లు రషెస్ చూసిన పవన్ అసంతృప్తిగా ఉన్నారట. ముఖ్యంగా లుక్ అసలు నచ్చలేదట. డిజాస్టర్ మూవీ శక్తి లో ఎన్టీఆర్ (NTR) ఫ్లాష్ బ్యాక్ లుక్ ని తలపిస్తుండగా, ఆయనకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదట.

36
Hari Hara Veera Mallu


హరి హర వీరమల్లు మూవీ సక్సెస్ పై పవన్ కే విశ్వాసం పోయినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే బడ్జెట్ సమస్యల్లో చిక్కుకుని షూటింగ్ ఆగిపోయిందంటున్నారు. పీరియాడిక్ మూవీ కావడంతో భారీ సెట్స్ ఏర్పాటు చేశారు. 

46

కరోనాతో పాటు పవన్ (Pawan Kalyan) వ్యక్తిగత అజెండాల కారణంగా మూవీ షూటింగ్ చాలా ఆలస్యమైంది. కరోనా సద్దుమణిగాక చక చకా హరిహర వీరమల్లు పూర్తి చేస్తాడనుకుంటే... భీమ్లా నాయక్ కోసం ఈ చిత్రాన్ని పక్కన పెట్టారు. మరోవైపు పొలిటికల్ టూర్స్ ఉండనే ఉన్నాయి. ఏడాదికి పైగా ఆలస్యమైన తరుణంలో బడ్జెట్ తడిసిమోపెడు అయ్యింది. 

56


అలాగే హీరోయిన్ ని మధ్యలో మార్చారు. మొదట జాక్విలిన్ ఫెర్నాండేజ్ ని తీసుకున్నారు. ఆమెను తప్పింది నోరా ఫతేహిని తెచ్చారు. ఇదో ప్రతికూల అంశం అని చెప్పాలి. కనీస ఫార్మ్, ఫేమ్ లేని నిధి అగర్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమా సక్సెస్ అంతా పవన్ భుజాలపైనే ఉంది. 

66

మొత్తంగా హరి హర వీరమల్లు మూవీ భవిష్యత్ అగమ్య గోచరంగా ఉంది. తెలుగులో ఎలాగోలా నెట్టుకొచ్చినా ఇతర భాషల్లో ఈ మూవీ రాణించడం కత్తిమీద సామే. పవన్ కి వంద కోట్ల షేర్ రాబట్టడమే కష్టంగా ఉంది. ఈ తరుణంలో పరిమితికి మించి ఖర్చు పెట్టి తీస్తే తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories