RRR First Review:ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ రివ్యూ... మైండ్ బ్లోయింగ్ టాక్... మరి ఎన్టీఆర్-చరణ్ ఎలా చేశారు!

First Published Jan 13, 2022, 3:43 PM IST

ఆర్ ఆర్ ఆర్ మూవీతో 2022 సంక్రాంతి (Sankranthi 2022) సంబరాలు మిన్నంటుతాయనుకుంటే వాయిదా వార్త నిరాశలోకి నెట్టేసింది. మూడేళ్లకు పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ ఏడాది కాలంగా ప్రేక్షకులను ఊరిస్తుంది. వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తుంది.

RRR Movie

ఎంత లేటైనా సంక్రాంతి బరిలో కిక్ ఇస్తుందిలే అని సంతోషించే లోపు... కరోనా  మరలా మొండి కాలు అడ్డుపెట్టింది. ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)విడుదల వాయిదా ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులను పూర్తి నిరాశలోకి నెట్టింది. వాళ్లతో పాటు సగటు సినీ అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. ట్రైలర్స్, టీజర్స్ మూవీపై విపరీతమైన హైఫ్ తీసుకురాగా... ఆర్ ఆర్ ఆర్ టికెట్స్ కోసం ఎగబడ్డారు. యూఎస్ లో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రెండు మిలియన్ డాలర్స్ వసూళ్లు దాటేసింది. 
 

తెలుగుతో పాటు మిగతా నాలుగు వెర్షన్లలో కూడా ఆర్ ఆర్ ఆర్ బుకింగ్స్ అదే స్థాయిలో ఉన్నాయి. సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అదే స్థాయిలో రాజమౌళి, ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ ప్రమోషన్స్ నిర్వహించారు. వాళ్ళ ప్రయత్నానికి ఫలితం దక్కే ఆఖరి నిమిషంలో కరోనా దెబ్బేసింది. కరోనా వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ విడుదలపై క్లారిటీ రావడం లేదు. 

అయితే ఆర్ ఆర్ ఆర్ యూనిట్ ఈ లోపు మూవీకి సెన్సార్ పూర్తి చేయిస్తున్నట్లు సమాచారం. దీనితో మూవీ టాక్ బయటికి వచ్చింది. యూఏఈ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు ఆర్ ఆర్ ఆర్ మూవీ సెన్సార్ రిపోర్ట్ పై కామెంట్ చేశారు. మూవీ ఎలా ఉందో ఆయన ఓ షార్ట్ రివ్యూ ఇచ్చారు. 

ఉమర్ సంధు తన ట్వీట్ లో... ఆర్ ఆర్ ఆర్ మూవీ అద్భుతం అంటూ చెప్పుకొచ్చారు. మూవీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ramcharan) పెర్ఫార్మన్స్ గురించి చెప్పాలంటే టాక్ ఆఫ్ ది టౌన్ అన్నారు. ఫైరింగ్ ఎమోజీలు జతచేస్తూ... ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటారని ఆయన పరోక్షంగా తెలియజేశారు. 


ప్రస్తుతం సెన్సార్ మెంబర్ ఉమర్ సంధు ట్వీట్ వైరల్ గా మారింది. అదే సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు. సినిమా గురించి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చిన తరుణంలో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అయితే ఉమర్ సంధుకి వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ గా పేరుంది. ఆయన గతంలో అట్టర్ ప్లాప్ సినిమాలకు కూడా ఇదే స్థాయిలో పాజిటివ్ రేటింగ్స్ ఇచ్చారు. 


అయినప్పటికీ దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ఏ మాత్రం నిరాశపరచరు అనే నమ్మకం అందరిలో గట్టిగా ఉంది. ఆర్ ఆర్ ఆర్ ప్రోమోలు దీన్ని రుజువు చేయగా... చాలా కాలం తర్వాత రాజమౌళి నుండి వస్తున్న విజువల్ వండర్ వెండితెరపై ఎంజాయ్ చేయాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్స్ చేస్తున్నారు. కాగా వీరిద్దరూ రెమ్యూనరేషన్ గా చెరో రూ. 55 కోట్లు తీసుకున్నారట. ఇక హీరోయిన్ అలియా భట్ రూ. 9 కోట్లు, కీలక రోల్ చేస్తున్న అజయ్ దేవ్ గణ్ రూ. 35 కోట్లు పారితోషికం తీసుకున్నారు. దర్శకుడు రాజమౌళి తన స్థాయికి తగ్గట్లు లాభాలలో వాటా తీసుకుంటున్నారట. 

జనవరి 7న ఆర్ ఆర్ ఆర్, 14న రాధే శ్యామ్ విడుదల కావాల్సి ఉంది. అనూహ్యంగా ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలు సంక్రాంతి బరి నుండి తప్పుకున్నాయి. పలు రాష్ట్రాలలో పాక్షికంగా కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. థియేటర్స్ పూర్తిగా మూసివేయడం, లేదా యాభై శాతం ఆక్యుపెన్సీ తో నడపడం జరుగుతుంది. దీనితో నిర్మాతలు వాయిదా నిర్ణయం తీసుకున్నారు. 

click me!