టాలీవుడ్ లో అనసూయతో పోటీ పడే యాంకర్స్ చాలా మందే ఉన్నారు. కానీ వారందరికీ అనసూయ తరహాలో వెండితెరపై ఛాన్సులు రావడం లేదు. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.