NTR-Prashanth Neel Movie Update: Shooting Starts on April 22, Release Expected for Sankranti 2026
యంగ్ టైగర్ ఏ పాత్ర చేసిన అందులో ఒదిగిపోతాడు అన్న విషయం తెలిసిందే. సెంటిమెంట్, యాక్షణ్, అతని కామెడీ టైమింగ్ గురించి చెప్పనక్కర్లేదు. అయితే.. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఇంటర్నేషనల్ ఫేమ్ రావడంతో తర్వాతి చిత్రాలకు కూడా కథలను ఆ రేంజ్‌లోనే ఎంపిక చేసుకుంటున్నాడు. టాలీవుడ్ కంటే.. బాలీవుడ్, హాలీవుడ్‌పై తారక్ కన్నేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఆయన ఇప్పుడు నటించబోతున్న చిత్రాలే ఆ విషయాన్ని చెబుతున్నాయి.
NTR-Prashanth Neel Movie Update: Shooting Starts on April 22, Release Expected for Sankranti 2026
బాలీవుడ్ చిత్రం వార్ 2 సినిమా షూటింగ్‌లో తారక్ బిజీగా ఉన్నారు. ముంబైయ్‌లోనే ఉంటూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. డ్రగ్స్ మాఫియా అంశంపై తీస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా తారక్ నటిస్తుండటంతో ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సన్నబడ్డాడు.. చూడ్డానికి కరెంట్ తీగలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావస్తుండటంతో.. దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో పడ్డారు. షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభిస్తామని మూవీ నిర్మాతలు ప్రకటించేశారు.
ఎన్టీఆర్ దర్శకుడు నీల్ చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే తేదీ వచ్చేసింది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి తారక్ సెట్లోకి అడుగుపెట్టబోతున్నట్లు ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ ప్రకటించేశారు. ఇప్పటికే కొన్ని యాక్షణ్ సన్నివేశాలను రామోజీ ఫిల్మసిటీలో తీశారు. అయితే.. ఈ నెల 22 నుంచి రెగ్యులర్ షెడ్యూల్స్‌లో చకచకా సినిమా తీసేందుకు యూనిట్ సిద్దమైంది. అన్ని అనుకూలిస్తే వచ్చే ఏడాది జనవరి సంక్రాంతి సందర్బంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్దమవుతున్నారు.
NTR-Prashanth Neel Movie Update: Shooting Starts on April 22, Release Expected for Sankranti 2026
తారక్, నీల్ కాంబోలో వస్తున్న చిత్రానికి డ్రాగన్ అని వర్కిల్ టైటిల్ పెట్టినట్లు సమాచారం. త్వరలో పేరుని ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలో కనిపిస్తారని టాక్ నడుస్తోంది. చైనీస్ గ్యాంగ్‌స్టర్ నుంచి ప్రేరణ పొందిన ఓ మాఫియా డాన్ పాత్రతో తారక్ సందడి చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Jr NTR
తారక్ వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఇప్పటికే వార్-2 నటిస్తున్న ఆయన.. తర్వాత చిత్రం ప్రశాంత్‌నీల్‌తో ఉంది. రీసెంట్‌గా దేవర-2 కూడా కచ్చితంగా ఉంటుందని ప్రకటించేశారు. మరోవైపు దర్శకుడు సుకుమార్‌తో ఇటీవల ఓ క్లోజ్ షాట్లో ఎన్డీఆర్ కనిపించాడు. సుకుమార్‌పై ప్రేమతో అని క్యాప్షన్ కూడా జోడించారు. దీంతో సుక్కూతో కూడా తారక్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక నీల్ తీయబోయే డ్రాగన్ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ సంచలనం చేస్తారన్న టాక్ నడుస్తోంది. దర్శకుడు రాజమౌలి తీసినట్లే భారీ సెట్టింగ్‌లు, మంది మార్భలంతో సినిమాలు తీస్తున్నాడు నీల్. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.