హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై దుమ్మురేపిన ఎన్టీఆర్‌ హీరోయిన్‌ మమతా మోహన్‌దాస్‌..

ఎన్టీఆర్‌ హీరోయిన్‌ మమతా మోహన్‌ దాస్‌ బైక్‌ రైడింగ్‌లో దుమ్ము రేపుతుంది. హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌పై చక్కర్లు కొట్టింది. స్టయిల్‌గా రెడీ అయి, మరింత స్టయిల్‌గా బైక్‌ డ్రైవ్‌ చేస్తూ వాహ్‌ అనిపిస్తుంది మమతా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

మమతా మోహన్‌ దాస్‌ బైక్‌ రైడింగ్‌ చేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. జీన్స్ వేసుకుని అబ్బాయిని తలపిస్తుంది ఈ అమ్మడు. అదే సమయంలో ఎద అందాలను చూపించేస్తుంది.
ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది. `ఎవరో రైడ్‌కి తీసుకెళ్తారని వెయిట్ చెయ్యడం ఎందుకు? 15 సంవత్సరాల తర్వాత బైక్ డ్రైవ్ చేయడం అమేజింగ్.. కెరీర్ స్టార్టింగ్‌లో సినిమా ప్రయత్నాలు చేసేటప్పుడు మోటార్ సైకిల్ నడిపేదాన్న`ని పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ బైక్‌ రైడింగ్‌ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. దీంతోపాటు హార్స్ తోనూ ఫోటోలకు పోజులిచ్చి వాహ్‌ అనిపించింది. అత్యంత స్టయిలీష్‌ లుక్‌లో ఫిదా మెస్మరైజ్‌ చేస్తుంది.
ఎన్టీఆర్‌,రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన `యమదొంగ` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది మమతా మోహన్‌ దాస్‌. ఆ సినిమా గ్లామరస్‌ పాత్రలో మెప్పించింది. మాస్‌ లుక్‌లో ఫిదా చేసింది.
కెరీర్‌ ప్రారంభంలో క్యాన్సర్‌ని జయించి సెకండ్‌ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ఈ మలయాళ భామలో నటి మాత్రమే కాదు, మంచి సింగర్‌ కూడా ఉన్నారు. తెలుగులోనూ పాటలు పాడి ఆకట్టుకుంది.
చిరంజీవి `శంకర్‌ దాదా జిందాబాద్‌`లో `ఆకలేస్తే అన్నంపెడతా`, ఎన్టీఆర్‌ `రాఖీ`లో `రాఖీ రాఖీ` లాంటి సూపర్‌ హిట్‌పాటలు పాడి ఉర్రూతలూగించింది.
నటిగా `చింతకాల రవి`, `కేడీ` చిత్రాల తర్వాత ఆమె టాలీవుడ్‌కి దూరమైంది. మలయాళంలో సినిమాలు చేస్తున్న మమతా టాలీవుడ్‌కి మాత్రం దాదాపు 11 ఏళ్లుగా దూరంగా ఉంది.
ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళంలో తెరకెక్కుతున్న `లాల్ బాగ్` అనే సినిమాలో నటిస్తోంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ లో తెరకెక్కుతున్న చిత్రమిది.

Latest Videos

click me!