NTR First Remuneration: ఎన్టీఆర్‌ తన ఫస్ట్ పారితోషికం ఏం చేశాడో తెలుసా? నెల రోజులు అదే పని, చివరికి

Published : May 18, 2026, 10:14 AM IST

ఎన్టీఆర్‌ `నిన్ను చూడాలని` చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. అయితే తన మొదటి పారితోషికం ఎంత వచ్చింది? దాన్ని ఆయన ఏం చేశాడో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. 

PREV
16
అమ్మతో దెబ్బలు తిన్న ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ మరో రెండు రోజుల్లో తన 43వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఒక ఆసక్తిర విషయం బయటకు వచ్చింది. ఎన్టీఆర్‌ హీరో కాకముందు జర్నీ చాలా క్రేజీగా సాగింది. ఎక్కడా సెలబ్రిటీ వారసుడు అనేలా లేదు. సాధారణ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగానే పెరిగాడు. బేసిక్‌గా తారక్‌ అల్లరోడు. ఆ కొంటె పనులకు వాళ్ల అమ్మ శాలినీ భాస్కర్‌ రావు విసిగిపోయేది. దీంతో బాగా కొట్టేదట. ఒకసారి పిల్లర్‌కి కట్టేసి కొట్టిందట. ఇలాంటి కొట్టుడు ఎన్నిసార్లు అనేది లేక్కేలేదు.

26
తాత సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన తారక్‌

ఎన్టీఆర్‌ చిన్నప్పట్నుంచే కూచిపూడి క్లాసికల్‌ డాన్స్ నేర్చుకున్నాడు. సినిమాల్లో రాణించడం కోసమే వాళ్లమ్మ ఆ డాన్స్ నేర్పించిందట. దేశంలో చాలా చోట్ల ఆయన తన బృందంతో కలిసి నృత్య ప్రదర్శణలు కూడా ఇచ్చాడు. ఎన్టీఆర్‌ బాలనటుడిగానే సినిమాల్లోకి వచ్చాడు. 1991లో `బ్రహ్మర్షి విశ్వామిత్ర` సినిమాలో భరతుడి పాత్రలో బాలనటుడిగా మెరిశారు. తాత రామారావుతో కలిసి నటించాడు. ఆ తర్వాత బాల `రామాయణం`లో రాముడిగా మెరిశారు.

36
ఎన్టీఆర్‌ ఫస్ట్ రెమ్యూనరేషన్‌

నాలుగేళ్ల తర్వాత `నిన్ను చూడాలని` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. దీనికి వీఆర్‌ ప్రతాప్‌ దర్శకుడు. ఉషాకిరణ్ మూవీస్‌ పతాకంపై రామోజీరావు నిర్మించారు. ఈ చిత్రం యావరేజ్‌గానే ఆడింది. ఎన్టీఆర్‌కి గొప్ప ఎంట్రీ ఇవ్వలేకపోయింది. అయితే ఈ మూవీకి మొదటిసారి ఆయన పారితోషికం అందుకున్నాడు. ఆయనకు రూ.3.5లక్షలు రెమ్యూనరేషన్‌ ఇచ్చారట. నిర్మాత పిలిచి ఈ డబ్బుని చేతిలో పెట్టడంతో తారక్‌ హ్యాండ్స్ వణికిపోయాయట. అంత డబ్బు ఆయన ఎప్పుడూ చూడలేదు. దీంతో షాక్‌కి గురయ్యాడట.

46
నెల రోజులు ఎన్టీఆర్‌ చేసిన పని ఇదే

ఎన్టీఆర్‌ ఆనందానికి, టెన్షన్‌ని హద్దుల్లేవ్‌. అయితే ఆ డబ్బులను ఏం చేయాలో తోచలేదట. ఇంటికి తీసుకెళ్లి రోజూ లెక్కపెట్టాడట. ఒక్క రోజు కాదు, రెండు రోజులు కాదు, ఏకంగా నెల రోజులు లెక్క పెడుతూనే ఉన్నాడట. అంతేకాదు ఇంట్లో మూల మూలన వాటిని దాచి పెట్టాడట. ఎవరైనా కొట్టేస్తారేమో అని భయపడుతూ, వాటినే చూసుకుంటూ ఉన్నాడట. ఇలా నెల రోజుల తర్వాత నెమ్మదిగా వాటిని తీసుకొని వాళ్ల అమ్మకి ఇచ్చాడట. ఆ తర్వాత తన టెన్షన్‌ పోయిందట.

56
ఎన్టీఆర్‌ మొదటి సినిమా అనుభవం

ఇక సినిమా విడుదలయ్యాక చూడాలి, ఉషామయూరి థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూశాడట. `కెమెరా భయం లేకపోవడంతో నాకేం కొత్తగా అనిపించలేదు, కానీ థియేటర్లో ఆ సినిమా చూసుకున్నాక కంగారొచ్చింది. ఏంట్రా బాబూ ఇంత వెరైటీగా ఉన్నా అనిపించింది. సినిమాలకు పనికొనస్తానా అనే సందేహం కూడా కలిగింది. కానీ `స్టూడెంట్‌ నెం 1` తర్వాత తనకు నమ్మకం కలిగిందట. ఆ తర్వాత రెచ్చిపోయినట్టు చెప్పాడు ఎన్టీఆర్‌. 2016లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు.

66
డ్రాగన్‌ ఎన్టీఆర్‌ బర్త్ డే ట్రీట్‌

ఎన్టీఆర్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దీనికి `డ్రాగన్‌` అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రంలో రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఎన్టీఆర్‌ ఊరమాస్‌ లుక్‌లో కనిపించబోతున్నారు. ఆయన మాఫియా డాన్‌గా కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్‌, టైటిల్‌ని ఎల్లుండి(మే 20న)న ఎన్టీఆర్‌ బర్త్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ మూవీకి తారక్‌ దాదాపు వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories