నేషనల్‌ వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్న `ఇస్మార్ట్` భామ నిధి అగర్వాల్‌.. కారణం తెలిస్తే ఫిదా అవుతారు?

Published : Aug 18, 2021, 12:30 PM ISTUpdated : Aug 18, 2021, 02:30 PM IST

నేషనల్‌ క్రష్‌గా ఇప్పటి వరకు రష్మిక మందన్నాని పిలుస్తుంటారు. ఆమె అభిమానులు ముద్దుగా సోషల్‌ మీడియాలో నేషనల్‌ క్రష్‌ అంటుంటారు. కానీ ఆమెకి పోటీనిస్తుంది `ఇస్మార్ట్` భామ నిధి అగర్వాల్‌. ప్రస్తుతం ట్రెండ్‌ అవుతుంది. 

PREV
18
నేషనల్‌ వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్న `ఇస్మార్ట్` భామ నిధి అగర్వాల్‌.. కారణం తెలిస్తే ఫిదా అవుతారు?

నేషనల్‌ క్రష్‌ నిధి అగర్వాల్‌ అంటూ నిన్న(మంగళవారం) మొత్తం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అందుకు కారణంగా నిన్న నిధి బర్త్ డే. 

28

`nationalcrushnidhhi` అనే ట్యాగ్‌ ట్విట్టర్‌లో దాదాపు ఎనిమిది గంటలపాటు ట్రెండ్‌ అవడం విశేషం.  దీంతో నిధి ఫాలోయింగ్‌కి నెటిజన్ల మైండ్‌ బ్లాక్‌ అయిపోతుంది. సినీ స్టార్స్ సైతం అవాక్కవుతున్నారు. 

38

ఇంతగా ట్రెండ్‌ కావడానికి మరో కారణం కూడా ఉంది. ఆమె తన బర్త్ డే వేడుకులను వృద్దులతో కలిసి జరుపుకోవడం. నిధి అగర్వాల్ తన బర్త్ డేని ఓల్డేజ్‌ హోమ్‌ జరుపుకుంది. దీంతో అందరి హృదయాలను గెలుచుకుంది.

48

అందుకే ఆమె అభిమానులు సోషల్‌ మీడియాలో నిధిని ట్రెండ్‌ చేస్తున్నారు. ఆమె వృద్ధులతో షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ దిగిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. అందరి మనసులను గెలుచుకుంది. 
 

58

నిధి అగర్వాల్‌ అంటే అందాలే గుర్తొస్తాయి. కానీ తనలోని మరో యాంగిల్‌ ఉందని సమయం చిక్కినప్పుడల్లా నిరూపిస్తుంది. సెకండ్‌ వేవ్‌ టైమ్‌లో కరోనా రోగులకు తనవంతు సాయాన్ని అందించింది. పేదలకు నిత్యావసర సరుకులు అందజేసింది. 

68

మరోవైపు నిధి అభిమానులు తమిళనాడులో ఏకంగా విగ్రహామే కట్టారు. ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయడం ఆ మధ్య హాట్‌ టాపిక్‌గా మారింది. నిధి క్రేజ్‌కిది నిదర్శనంగా నిలుస్తుంది.

78

`ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతో పాపులర్‌ అయిన నిధి అగర్వాల్‌ ఆ పాపులారిటీని కరెక్ట్ గా వాడుకుంటోంది నిధి. ఆ సినిమా వరుసగా భారీ ఆఫర్స్ ని సొంతం చేసుకుంటుంది. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో దూసుకుపోతుంది. 
 

88

ప్రస్తుతం నిధి ఏకంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో `హరిహరవీరమల్లు`లో నటిస్తుంది. అలాగే `హీరో` చిత్రంతో గల్లా అశోక్‌ తో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో ఓ సినిమా చేస్తుంది. ఇదే కాదు సోనూసూద్‌తో ఓ స్పెషల్‌ వీడియో సాంగ్‌ని చేసింది నిధి. `సాత్‌ కియా నిభోగే` పాటలో తనదైన స్టెప్పులతో మెస్మరైజ్‌ చేస్తుంది. ఇది ఇటీవల విడుదలై యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories