NTR Political entry: రామయ్యా రాజకీయాల్లోకి రావయ్యా... ఎక్కడికెళ్లినా ఇదే నినాదం!

Published : Dec 28, 2021, 10:17 AM ISTUpdated : Dec 28, 2021, 11:52 AM IST

ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ వేడుక (RRR Prerelease event) చెన్నైలో డిసెంబర్ 27న ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ రాజకీయ నినాదాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

PREV
18
NTR Political entry: రామయ్యా రాజకీయాల్లోకి రావయ్యా... ఎక్కడికెళ్లినా ఇదే నినాదం!

ఎన్టీఆర్ (NTR)రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్ ఎక్కువైంది. టీడీపీ పార్టీలోని ఒక వర్గం ఆయన రాకను గట్టిగా కోరుకుంటున్నారు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ నాయకత్వంలో టీడీపీ భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందని ఆ పార్టీ కేడర్ భావన. నాయకత్వ మార్పు ద్వారానే టీడీపీకి పునఃజీవనం అని వారి ప్రగాఢ నమ్మకం. ఇది టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు మింగుడు పడని విషయం అయినప్పటికీ, పార్టీ కేడర్ మాత్రం మౌనంగా ఉండలేకపోతున్నారు.

28

చంద్రబాబు (Nara Chandrababu)బహిరంగ సభలలో ఎన్టీఆర్ నినాదాలు ఆయనను వెంటాడుతున్నాయి. ఆయన పర్యటనలలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ తమ నిరసన తెలియజేస్తున్నారు. కొడుకు లోకేష్ కోసం బాబు పార్టీ భవిష్యత్తు ప్రమాదంలోకి లాగారని మెజారిటీ శ్రేణుల అభిప్రాయం. ఈ విషయాన్ని కొందరు సీనియర్ నాయకులు బహిరంగంగానే మాట్లాడారు. ఎన్టీఆర్ రాకతో టీడీపీ పార్టీ పూర్తిగా నందమూరి కుటుంబం చేతిలోకి వెళ్ళిపోతుందనే భయం చంద్రబాబును వెంటాడుతుంది. బలమైన క్యాడర్ కలిగిన టీడీపీ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా ఉన్నప్పటికీ భవిష్యత్ లో పుంజుకుంటుంది, తద్వారా లోకేష్ సీఎం కావడం ఖాయమని బాబు విశ్వాసం.

38

వైసీపీ (YCP)పార్టీని వచ్చే ఎన్నికల్లోనే ధీటుగా ఎదుర్కోవాలని, 2024లో అధికారం చేపట్టాలని భావిస్తున్న టీడీపీ పార్టీలోని ఒక వర్గం ఎన్టీఆర్ ని ఆశాకిరణంగా భావిస్తున్నాయి. పూర్తిగా ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు ఇవ్వకున్నా.. అతనికి సముచిత స్థానం ఇచ్చి, పార్టీ కోసం పని చేసేలా చూడాలి అంటున్నారు. ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం... బాబు, లోకేష్ తప్పుకొని ఎన్టీఆర్ కి పార్టీ సర్వహక్కులు ఇవ్వాలంటున్నారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ తరపున సీఎం కావాలని కోరుకుంటున్నారు. 

48


ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేది లేదు. అయినప్పటికీ టీడీపీ వర్గాలు తమ ప్రయత్నాలు ఆపడం లేదు. అయితే టీడీపీలో ఒక వర్గం మాత్రం ఎన్టీఆర్ కి సప్పోర్ట్ చేస్తున్నాయి. అదే పార్టీలో బాబు, లోకేష్ వర్గం కూడా ఉంది. భువనేశ్వరి క్యారెక్టర్ అసాసినేషన్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ పై బాబు వర్గం విరుచుకుపడింది. సొంత మేనత్తను కించపరిచిన వైసీపీ నాయకులపై ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగా లేదని విమర్శల దాడికి దిగారు. వర్ల రామయ్య లాంటి సీనియర్ నేత ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన విమర్శల వెనుక బాబు ఉన్నాడనేది ఓపెన్ సీక్రెట్. 

58

టీడీపీ క్యాడర్ లో ఎన్టీఆర్ పై ఉన్న సానుభూతిని దెబ్బతీయాలని, అదే సమయంలో లోకేష్ పై వాళ్లకు నమ్మకం కలిగేలా చేయాలని బాబు మాస్టర్ ప్లాన్ వేశారు. అనూహ్యంగా టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయి దీనిపై సోషల్ మీడియా దాడులు చేసుకున్నాయి. వైసీపీ వెర్సస్ టీడీపీ గా మొదలైన భువనేశ్వరి ఎపిసోడ్ కాస్తా.. ఎన్టీఆర్ వెర్సస్ బాబు అన్నట్లు మారింది. అంతర్గత వర్గ పోరాటం మంచిది కాదని భావించిన బాబు తర్వాత నష్ట నివారణ చర్యలు చేపట్టారు.

68

ఇటీవల జాతీయ మీడియా ఇంటర్వ్యూలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నలు బాబుకు మింగుడు పడలేదు. టీడీపీ భవిష్యత్ బాగోలేదంటూనే... జగన్ (YS Jagan), కేటీఆర్ లతో పోల్చుతూ లోకేష్ సమర్ధతపై బాబును ప్రశ్నించారు. పరోక్షంగా ఆ ఇద్దరు సీఎం కుమారులలో ఉన్న సమర్ధత లోకేష్ ఉందా అని సూటి ప్రశ్నలు వేశారు. అలాగే అధినాయకుడిగా మీరు ఏడవడం ఏమిటీ? మీరు నిజంగానే ఏడ్చారా? వంటి ప్రశ్నలతో బాబుకు ఎలా స్పందించాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.

78

మరోవైపు టీడీపీ పార్టీలోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాబుకు తలనొప్పిగా మారారు. ఎన్టీఆర్ ఎక్కడ బహిరంగ వేదికలో పాల్గొంటున్నా అక్కడ దిగిపోతున్నారు. ఇక చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కూడా టీడీపీ జెండాలు, ఎన్టీఆర్ ఫ్లాగ్స్ దర్శనమిచ్చాయి.

88

ఎన్టీఆర్ సభల్లో టీడీపీ ఫ్లాగ్స్ కనిపించడం పరోక్షంగా బాబుపై నిరసన వ్యక్తం చేయడమే అని చెప్పాలి. అదే సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లో క్రియాశీలకం కావాలని వారి ఆకాంక్ష. ప్రత్యర్థి పార్టీ బలంగా ఉండగా, ఎన్టీఆర్ రాకతోనే వాళ్ళను ఎదుర్కోగలని వారి ప్రగాఢ విశ్వాసం.

Also read ‘RRR’:ఓటీటీ లో చూడాలంటే ఇలా చెయ్యాలంటున్నారు,జరిగేపనేనా?

Also read RRR Pre Release Event: ఎన్టీఆర్‌ ఇండియన్‌ సినిమా చేసుకున్న అదృష్టం.. చరణ్‌ అరుదైన నటుడుః రాజమౌళి ఎమోషనల్‌

click me!

Recommended Stories