ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కొత్త డిమాండ్‌.. `కేజీఎఫ్‌ 2` హీరోయిన్‌ కావాలంటూ పోస్ట్ లు.. హాట్‌ టాపిక్‌

Published : May 27, 2022, 08:11 PM IST

ఎన్టీఆర్‌ సినిమాలకు హీరోయిన్లు సెట్‌ కావడం లేదు. దీంతో ఫ్యాన్స్ కొత్త నినాదం అందుకుంటున్నారు. ఏ సినిమాకి ఏ హీరోయిన్‌ కావాలో చెబుతున్నారు. కొందరైతే ఏకంగా డిమాండ్‌ చేస్తుండటం విశేషం. 

PREV
17
ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కొత్త డిమాండ్‌.. `కేజీఎఫ్‌ 2` హీరోయిన్‌ కావాలంటూ పోస్ట్ లు.. హాట్‌ టాపిక్‌

ఎన్టీఆర్‌(NTR) ఇప్పుడు `NTR30`లో నటించబోతున్నారు. కొరటాల శివ(Koaratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రం ప్రకటించి చాలా రోజులవుతుంది. ఇటీవల చిత ప్రీ లుక్‌ పేరుతో సినిమా థీమ్‌ని తెలిసేలా ఓ గ్లింప్స్ వీడియోని విడుదల చేశారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ట్రెండింగ్‌ అయ్యింది. అయితే ఇందులో హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ఫైనల్‌ కాలేదు. అలియాభట్‌, దీపికా పదుకొనె, రష్మిక మందన్నా, జాన్వీ కపూర్‌, కియారా అద్వానీ వంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఇప్పటి వరకు ఇంకా క్లారిటీ లేదు.

27

మరోవైపు `కేజీఎఫ్‌ `(KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తోనూ ఓ సినిమా చేయబోతున్నారు తారక్‌. `NTR31` పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాని కూడా త్వరగానే ప్రారంభించాలనుకుంటున్నారు. ప్రశాంత్‌ నీల్‌ చేస్తున్న `సలార్‌`(Salaar) పూర్తయ్యాక ఎన్టీఆర్‌ సినిమాని మొదలెట్టనున్నారు. ఆల్మోస్ట్ ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. 

37

ఇక కొరటాల శివ చిత్రంలో హీరోయిన్ల సమస్య వేధిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కొత్త ఆలోచనలకు తెరలేపారు. తామే హీరోయిన్‌ని సజెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్‌ 31 చిత్రానికి హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలో చెబుతున్నారు. అందులో భాగంగా `కేజీఎఫ్‌2` హీరోయిన్‌ని తీసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. 
 

47

అంతేకాదు `ఎన్టీఆర్‌ 31`లో `కేజీఎఫ్‌` ఫేమ్‌ శ్రీనిధి శెట్టిని(Srinidhi Shetty) హీరోయిన్‌గా తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. సజెషన్‌ నుంచి డిమాండ్‌ స్థాయికి వెళ్లిపోయారు. వరుసగా పోస్ట్ లు పెడుతూ వైరల్‌ చేస్తున్నారు. ఇలా దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ని గట్టిగా ఇరికిస్తున్నారు. ఈ సినిమా కోసం హీరోయిన్‌ ఎవరనేది దర్శకుడి మైండ్‌లో ఎవరున్నారో గానీ అది లెక్కచేయకుండా ఫ్యాన్స్‌ మాత్రం శ్రీనిధి శెట్టిని తీసుకోవాలని సోషల్‌ మీడియా ద్వారా డిమాండ్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 
 

57

శ్రీనిధిశెట్టి `కేజీఎఫ్‌` సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకి పరిచయమైంది. తొలి సినిమాతోనే పాన్‌ ఇండియా ఇమేజ్‌ని పొందింది. ఇండియావైడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది.ఈ రెండు సినిమాలు విడుదలయ్యేంత వరకు ఆమె కొత్తగా మరే సినిమాకి సైన్‌ చేయలేదు. దీంతో ఆమెకి డిమాండ్‌ కూడా పెరుగుతుంది. `కేజీఎఫ్‌ 2` సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు మరింత డిమాండ్‌ పెరిగింది. అందుకే ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఆమెని తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

67

ప్రస్తుతం ఆమె విక్రమ్‌ హీరోగా రూపొందిన `కోబ్రా` చిత్రంలో నటిస్తుంది శ్రీనిధి శెట్టి. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంది. కొత్త సినిమాల కోసం చర్చలు జరుపుతుందట, త్వరలోనే ఆమె వరుసగా సినిమాలు ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే సమయంలో `కేజీఎఫ్‌` లాంటి పాన్ ఇండియా సినిమా హీరోయిన్‌ ఇంకా కొత్త సినిమాలు ప్రకటించకపోవడం ఏంటనేది డౌట్స్ కూడా వినిపిస్తున్నాయి. 

77

మరి తారక్‌ ఫ్యాన్స్ కోరికని ప్రశాంత్‌ నీల్‌ పట్టించుకుంటాడా? శ్రీనిధి శెట్టిని ఫైనల్‌ చేస్తారా? లేక మరో హీరోయిన్‌తో ముందుకెళ్తారా? ఎన్టీఆర్‌ 31వ సినిమాకైనా హీరోయిన్ల ఎంపిక ఫాస్ట్ గా జరుగుతుందా? లేక కొరటాల సినిమా మాదిరిగానే జరుగుతుందా ? అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ (కళ్యాణ్‌ రామ్‌) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories