ఎన్టీఆర్ జన్మదినం నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్... టీనేజ్ లోనే హీరోగా మారాడు. ఎన్టీఆర్ కెమెరా ముందుకు వచ్చిన మొదటి చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఆ చిత్రంలో బాల భరతుడు పాత్ర చేశారు. కానీ ఆ మూవీ విడుదల కాలేదు.
26
అనంతరం దర్శకుడు గుణశేఖర్ ప్రయోగాత్మకంగా బాల రామాయణం చేశారు. అందులో రామునిగా ఎన్టీఆర్ నటించారు. బాల రామాయణం విజయం సాధించింది. దర్శకుడు గుణశేఖర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. బాల రామాయణం మూవీ విడుదలైన ఐదేళ్లకు ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
36
NTR Birthday
నిన్ను చూడాలని ఎన్టీఆర్ కి హీరోగా మొదటి చిత్రం. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించారు. ఈ చిత్ర షూటింగ్ సమయానికి ఎన్టీఆర్ వయసు 17 ఏళ్ళు. విడుదల నాటికి 18 ఏళ్ళు. నిన్ను చూడాలని నిరాశపరిచింది.
46
ఈ చిత్రానికి ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ గా రూ. 4 లక్షలు తీసుకున్నారట. ఈ డబ్బులు ఏం చేయాలో, ఎలా ఖర్చు చేయాలో తెలియని ఎన్టీఆర్ వాళ్ళ అమ్మకు ఇచ్చేశారట. తన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? దాన్ని ఏం చేసింది? ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
56
ప్రజెంట్ ఆయన రెమ్యూనరేషన్ దాదాపు వంద కోట్లు. హృతిక్ రోషన్ తో చేస్తున్న మల్టీస్టారర్ వార్ 2కి గాను ఎన్టీఆర్ వంద కోట్ల వరకు తీసుకుంటున్నారట. అలాగే దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర చిత్రానికి రూ. 80 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం.
66
నాలుగు లక్షలతో మొదలైన ఎన్టీఆర్ ప్రస్థానం వందల రెట్లు పెరిగి వంద కోట్లకు చేరింది. గ్లోబల్ స్టార్ రేంజ్ కి ఆయన ఎదిగారు. జపాన్ వంటి దేశంలో ఇమేజ్ రాబట్టారు. ఎన్టీఆర్ రానున్న కాలంలో మరిన్ని సంచలనాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.