కస్తూరి నటనా జీవితం
కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ వైపు అడుగులు వేసింది. 1992లో మిస్ చెన్నై పోటీలో గెలిచారు. తర్వాత ఫెమినా మిస్ మద్రాస్ పోటీలోనూ గెలిచారు. ఆ తర్వాత సినిమాల వైపు టర్న్ తీసుకుంది. కస్తూరి పేరెంట్స్ కూడా ఆమెని సినిమాల వైపు ప్రోత్సహించారు.
కస్తూరి మోడలింగ్
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కస్తూరి తల్లి సుమతి న్యాయవాది, తండ్రి శంకర్ ఇంజనీర్. దీంతో కస్తూరి చిన్నప్పటి నుంచే ఉన్నతమైన లైఫ్‌ని లీడ్ చేసింది. చదువులో మంచి ప్రతిభ కనబరిచినా, మోడలింగ్ పై ఆసక్తి ఆమెను నటిగా మార్చింది. తల్లి న్యాయవాది కావడంతో చిన్నప్పటి నుంచే సమాజంలోని చాలా విషయాలపై తన గొంతు వినిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆమె కామెంట్స్ వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాయి.
తెలుగు వారిపై కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
తెలుగు మాట్లాడే మహిళల గురించి కస్తూరి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. గత కొన్ని రోజుల క్రితం తెలుగు మాట్లాడే మహిళల గురించి కస్తూరి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. దీంతో ఆమెపై కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం ఆమె రిమాండ్‌లో ఉంది.
కస్తూరి అరెస్ట్
చెన్నై ఎగ్మూర్ పోలీస్ స్టేషన్ లో కస్తూరిపై ఫిర్యాదు నమోదు కావడంతో నవంబర్ 16న హైదరాబాద్ లో ఆమెను అరెస్ట్ చేశారు. నిర్మాత ఇంట్లో దాక్కున్న కస్తూరిని పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. కానీ కస్తూరి విడుదల చేసిన వీడియోలో తన ఇంటి నుంచే పోలీసులు తనను అరెస్ట్ చేశారని, ఎవరికీ భయపడి తాను దాక్కోలేదని, పోలీసులకు సహకరిస్తానని చెప్పారు.
కస్తూరి కుటుంబ వివరాలు
వివాదాలను ధైర్యంగా ఎదుర్కొనే కస్తూరి కుటుంబ నేపథ్యం, ఆస్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 48 ఏళ్ల కస్తూరి భర్త రవికుమార్ డాక్టర్. వీరికి సంకల్ప్ అనే కొడుకు, శోభిని అనే కూతురు ఉన్నారు. పెళ్లయినా నటనలో కొనసాగుతున్న కస్తూరి భర్త కూడా ధనవంతుల కుటుంబానికి చెందినవారు. కస్తూరికి చెన్నైలో రెండు ఇళ్ళు, హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉన్నాయి. అమెరికాలో కూడా ఒక ఇల్లు ఉందని సమాచారం.