‘వార్2’కు ముహూర్తం ఫిక్స్? ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ మూవీ మొదలయ్యేది ఎప్పుడంటే..

First Published | Apr 13, 2023, 6:45 PM IST

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా ‘వార్2’ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం కానుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా అదిరిపోయే అప్డేట్ అందింది.
 

‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ దక్కించుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR). వరల్డ్ వైడ్ గా తారక్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఆయన సినిమాలు కూడా భారీ స్థాయిలోనే తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం తారక్ క్రియేటివ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. 
 

చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ లో వేసిన భారీ షిప్ సెట్ లో షూటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నట్టు  తెలుస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఎన్టీఆర్ బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు బిగ్ అప్డేట్ వచ్చింది. దీనిపై అభిమానుల ఆసక్తి  రోజురోజుకు పెరిగిపోతోంది.
 


బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) - ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా ‘వార్2’ రూపుదిద్దుకోనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ లో భాగంగా ‘వార్’ చిత్రానికి సీక్వెల్ గా War2 రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

ఈక్రమంలో షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కాబోతుందంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా అదిరిపోయే అప్డేట్ అందింది. హృతిక్ - ఎన్టీఆర్ సినిమా ప్రారంభంపై క్రేజీ బజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘వార్2’ స్పై థ్రిల్లర్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. 

తాజాగా సినిమా ప్రారంభంపైనా ఓ న్యూస్ వినిపిస్తోంది. దీపావళి కానుకగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తోంది. అప్పటి వరకు తారక్ NTR30ని పూర్తి చేసే అవకాశం ఉన్నందున స్పై థ్రిల్లర్ ను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు తారక్ ‘పఠాన్ వర్సెస్ టైగర్’ యూనివర్స్ లోనూ ఓ కీలకపాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపైనా అప్డేట్ అందాల్సి ఉంది. 

ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలోని NTR30పై ఫోకస్ పెట్టారు. అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తారక్ సరసన నటిస్తోంది. చిత్రం కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.  

Latest Videos

click me!