తన తండ్రి రిక్వస్ట్ చేసినా వదిలేసిన నిత్యా మీనన్.. జయలలిత బయోపిక్ లో ఎందుకు నటించలేదంటే

Published : Jan 25, 2025, 03:43 PM IST

తాను నటించాల్సిన జయలలిత బయోపిక్ ఎందుకు ఆగిపోయిందో నిత్యామీనన్ తాజాగా ఇంటర్వ్యూలో వివరించింది.

PREV
13
తన తండ్రి రిక్వస్ట్ చేసినా వదిలేసిన నిత్యా మీనన్.. జయలలిత బయోపిక్ లో ఎందుకు నటించలేదంటే

సౌత్ లో ట్యాలెంటెడ్ హీరోయిన్స్ లో నిత్యామీనన్ ఒకరు. అల మొదలైంది చిత్రంతో నిత్య మీనన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి చిత్రాలు నిత్యా మీనన్ క్రేజ్ పెంచాయి. నిత్యా మీనన్ చివరగా తెలుగులో భీమ్లా నాయక్ చిత్రంలో నటించింది. నిత్యా మీనన్ గతంలో జయలలిత బయోపిక్ చిత్రంలో నటించాల్సింది. 

23

తాను నటించాల్సిన జయలలిత బయోపిక్ ఎందుకు ఆగిపోయిందో నిత్యామీనన్ తాజాగా ఇంటర్వ్యూలో వివరించింది. ప్రియదర్శిని అనే యువ దర్శకురాలి దర్శకత్వంలో నిత్యామీనన్ జయలలిత బయోపిక్ ప్రారంభించారు. ది ఐరెన్ లేడీ అనే టైటిల్ తో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ చిత్రం ప్రారంభ దశలోనే ఆగిపోయింది. నిత్యా మీనన్ మాట్లాడుతూ.. జయలలిత బయోపిక్ లో నటించాలని ఎంతగానో ఆశపడ్డా. చర్చలు కూడా జరిగాయి. 

33

కానీ అదే సమయంలో తలైవి టైటిల్ లో కంగనా రనౌత్ జయలలిత బయోపిక్ లో నటించింది. మళ్ళీ మేము జయలలిత బయోపిక్ చేస్తే రిపీట్ అవుతుందని అనుకున్నాం. మా నాన్న మాత్రం తప్పకుండా నువ్వు జయలలిత బయోపిక్ లో నటించాలని కోరారు. ఎలా సాధ్యం అవుతుంది అని చర్చిస్తుండగా.. జయలలిత బయోపిక్ పైనే క్వీన్ అనే వెబ్ సిరీస్ కూడా వచ్చింది. ఆల్రెడీ రెండు బయోపిక్ లు వచ్చాక మేము చేయడం వృధా అని భావించాం. అందుకే ఆ చిత్రాన్ని పక్కన పెట్టేసినట్లు నిత్యామీనన్ పేర్కొంది. 

click me!

Recommended Stories