పెళ్లి కూతురు డ్రెస్‌లో నిత్యా మీనన్‌ హోయలు.. తోడు పెళ్లి కూతురు అదిరిపోయిందంతే!

First Published | Apr 27, 2021, 6:58 PM IST

బొద్దు గుమ్మ నిత్యా మీనన్‌ పెళ్లి కూతురుగా ముస్తాబైంది. పెళ్లికి రెడీ అని సిగ్నల్‌ ఇస్తున్నట్టుగా ఉన్న ఈ అమ్మడి ఫోటోలు ఆద్యంతం వైరల్‌ అవుతుండగా, ఇందులో తోడు పెళ్లి కూతురు మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. 

నిత్యా మీనన్‌ అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఈ మధ్య పెద్దగా కనిపించని ఈ బ్యూటీ ఉన్నట్టుండి అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. పెళ్లి కూతురుగా కనిపించి షాక్‌ ఇచ్చింది.
వైట్‌ అండ్‌ వైట్‌ పెళ్లి కూతురుగా ముస్తాబైంది. నేను మ్యారేజ్‌ చేసుకుంటున్నానోచ్‌ అని సడెన్‌గా చెప్పి షాక్‌ ఇచ్చినట్టుగా ఉంది తాజాగా నిత్యా మీనన్‌ లుక్‌.

అంతేకాదు తోడు పెళ్లి కూతురు కూడా అంతే అందంగా ముస్తాబవడం విశేషం. చిట్టి పొట్టిగా, క్యూట్‌గా ఉన్న చిన్న పాప సైతం పెళ్లి కూతురుగా రెడీ నిత్యా మీనన్‌తో కలిసి సందడి చేసింది.
ఈ ఫోటోలను చూస్తుంటే నిత్యా మ్యారేజ్‌ చేసుకుంటుందా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్ అదే కామెంట్లు పెడుతున్నారు.
ఇందులో క్యూట్‌ పాపకి నిత్యా ముద్దు పెట్టిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె చెబుతూ, `మిస్టికల్‌ రొమాన్స్` అని పేర్కొనడం విశేషం.
ప్రస్తుతం నిత్యా మీనన్‌ లేటెస్ట్ ఫోటోస్‌ వైరల్‌గా మారాయి. ఇది ఆమె పోర్ట్ ముజిరిస్‌ కోచి హోటల్‌లో ఇలా పోజులిస్తూ హోయలు పోయింది.
ప్రస్తుతం నిత్యా మీనన్‌ తెలుగులో `గమనం` చిత్రంలో గెస్ట్ గా నటిస్తుంది. దీంతోపాటు మలయాళంలో 19(1)(ఏ), `కోలాంబి` చిత్రాల్లో నటిస్తుంది.
ఇటీవల ఆమె నటించిన `నిన్నిలా నిన్నిలా` సినిమా విడుదలై ఆకట్టుకుంది.
పెళ్లి కూతురుగా హంట్‌ చేస్తున్న నిత్యామీనన్‌. పిక్స్ ట్రెండింగ్‌.

Latest Videos

click me!