Nithya Menen: పిల్లలు కావాలంటే పెళ్లితో పనేంటి..? దుమారం రేపుతున్న నిత్యామీనన్ బోల్డ్ కామెంట్స్

Published : Apr 27, 2026, 02:01 PM IST

సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ తను చాలా స్పెషల్ అని మరోసారి నిరూపించుకుంది నిత్యామీనన్ . పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనడంలో తప్పేముందని ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

PREV
15
పెళ్లి వద్దు, కానీ బిడ్డ కావాలి తప్పేముంది?

ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు, డేటింగ్, బ్రేకప్‌లు, విడాకులు లాంటివి చాలా కామన్ అయిపోయాయి. కానీ ఇటువంటి ఇండస్ట్రీలో కూడా కొంత మంది చాలా హుందాగా నడుచుకుంటూ.. ఆదర్శంగా జీవిస్తుంటారు. ఆకోవలేకే వస్తుంది హీరోయిన్ నిత్యామీనన్. ఆమె ఎప్పుడూ చాలా హుందాగా ఉంటారు. దశాబ్దాలుగా టాలీవుడ్, శాండల్‌వుడ్, కోలీవుడ్‌లో వరుస హిట్లు కొట్టి, 'నేషనల్ అవార్డు' కూడా అందుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్, ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన ఓ కామెంట్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

25
పెళ్లిపై నిత్యా ఎందుకు సైలెంట్‌గా ఉంటారు?

ప్రస్తుతం 38 ఏళ్ల నిత్యామీనన్, సినిమా సెలక్షన్‌లో ఎంత కేర్ తీసుకుంటారో, తన పర్సనల్ విషయాలను కూడా అంతే సీక్రెట్‌గా ఉంచుతారు. నలభై ఏళ్లకు దగ్గరవుతున్నా పెళ్లి గురించి ఆమె ఎప్పుడూ మాట్లాడలేదు. "పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే పూర్తి జీవితం కాదు" అనేది నిత్యా స్ట్రాంగ్ ఫిలాసఫీ. కానీ, రీసెంట్‌గా ఓ 'ర్యాపిడ్ ఫైర్' రౌండ్‌లో ఆమె ఇచ్చిన సమాధానం మాత్రం సంప్రదాయవాదులను షాక్‌కు గురిచేసింది.

35
పెళ్లి లేకుండా పిల్లల్ని కనడంపై నిత్యా కామెంట్స్?

ఓ ఇంటర్వ్యూ క్లిప్‌లో, నిత్యామీనన్‌కు "పెళ్లికి ముందే లేదా పెళ్లి చేసుకోకుండానే గర్భవతి అవ్వడం కరెక్టేనా?" అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె ఏమాత్రం తడుముకోకుండా, "పెళ్లి చేసుకోకుండా బిడ్డను కనడంలో తప్పేమీ లేదు. మీకు బిడ్డ కావాలి కానీ పెళ్లి బంధం వద్దు అనుకుంటే అందులో తప్పేముంది? ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగింది. దానికి చాలా మార్గాలున్నాయి. చాలా మంది ఆ పద్ధతిని ఫాలో అవుతున్నారు కూడా," అని చాలా బోల్డ్‌గా సమాధానమిచ్చారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

45
సినిమా ప్రభావమా? లేక పర్సనల్ ఒపీనియనా?

నిజానికి, నిత్యామీనన్ ఇలా మాట్లాడటానికి ఓ కారణం ఉంది. గత ఏడాది ఆమె నటించిన 'కాదలిక్కా నేరమిల్లై' అనే తమిళ సినిమా కథ కూడా ఇదే. పెళ్లి చేసుకోకుండా ఐవీఎఫ్ (IVF) ద్వారా బిడ్డను కనాలనుకునే మహిళ పాత్రలో నిత్యా కనిపించారు. ఆ సినిమా ప్రమోషన్స్ టైంలో ఇచ్చిన ఈ పాత ఇంటర్వ్యూనే ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ఆ పాత్ర కోసం ఆమె అలా మాట్లాడినా, ఆమె ఆలోచనలు నేటి తరం మహిళల స్వేచ్ఛను సూచిస్తున్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

55
బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న నిత్య

చాలా మంది హీరోయిన్లు కెరీర్ డౌన్ అవ్వగానే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని చూస్తారు. కానీ నిత్యామీనన్ మాత్రం ఇప్పటికీ ఇతర భాషల్లో బిజీ యాక్ట్రెస్‌గా ఉన్నారు. పెళ్లి అనే బంధనం కన్నా సింగిల్‌గా స్వేచ్ఛగా ఉండటానికే ఇష్టపడే ఆమె, ప్రస్తుతం తన 'సింగిల్' స్టేటస్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె బోల్డ్ మాటలు కొందరికి ఆశ్చర్యం కలిగించినా, ఆమె అభిమానులు మాత్రం "నిత్యా ఎప్పుడూ ఇంతే క్లారిటీతో మాట్లాడుతుంది, అందుకే మేము ఆమె అభిమానులం" అంటూ సపోర్ట్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories