రైల్వే డిపార్ట్మెంట్ అభ్యంతరం చెప్పడంతో ఓ సూపర్ హిట్ మూవీ పాటే పూర్తిగా మారిపోయింది. సినిమా సూపర్ హిట్ అయ్యాక రైల్వే డిపార్ట్మెంట్ చుక్కలు చూపించింది. అసలు వివాదం ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.
తెలుగులో సూపర్ హిట్ అయిన చాలా సినిమాలు కూడా వివాదంలో చిక్కుకున్నాయి. సాధారణంగా వివాదాలు రావడం వేరు, ప్రభుత్వ సంస్థల నుంచి వివాదాలు రావడం వేరు. డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ కి ఇండియన్ రైల్వేస్ నుంచి సెగ తగిలింది. ఆ సినిమా మరేదో కాదు.. క్రేజీ హీరో నితిన్ నటించిన తొలి చిత్రం జయం. ఈ మూవీలో నితిన్, సదా జంటగా నటించారు.
25
సాంగ్ విషయంలో వివాదం
ఈ చిత్ర సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఓ ఇంటర్వ్యూలో జయం మూవీ విశేషాలు గుర్తు చేసుకున్నారు. ఈ మూవీలో ఇండియన్ ట్రైన్స్ ని ఉద్దేశించి బండి బండి రైలు బండి అనే సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ మొత్తం ఇండియన్ రైల్వేస్ పై సెటైర్లు వేసే విధంగా సాగుతుంది. 'బండి బండి రైలు బండి వేళ కంటూ రాదూ లెండి.. క్రీస్తు పూర్వం ఇంజను..రంగులతో హంగులతో పైన పటారం, కానీ లోన లొటారం.. పాత సామానులోడికి అమ్ముకుంటే తలో పిడికెడు సెనగలు వచ్చేను లాంటి సెటైరికల్ లిరిక్స్ ఈ సాంగ్ లో ఉంటాయి.
35
సెటైర్లు వేస్తూ పాట
ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు నిజంగానే ట్రైన్ లో, రైల్వేస్టేషన్ లో షూట్ చేశారు. పాటలు రిలీజై సూపర్ హిట్ అయ్యాయి. సినిమా కూడా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అభ్యంతరం తెలిపారు. మా దగ్గర అనుమతి తీసుకుని, మా రైల్వే స్టేషన్ లో, మా ట్రైన్ లో సినిమా షూట్ చేసి మాపైనే సెటైర్లు వేస్తారా ? నెగిటివ్ గా పాట రాస్తారా అని అభ్యంతరం తెలిపారు.
దీనితో అదే సాంగ్ ని పాజిటివ్ గా సెకండ్ వెర్షన్ రాయించి రిలీజ్ చేసినట్లు ఆర్పీ పట్నాయక్ తెలిపారు. దీనితో ఆ వివాదం ముగిసింది. ఈ సాంగ్ రెండు వెర్షన్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.
55
స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన నితిన్
ఈ మూవీతో నితిన్ కి గ్రాండ్ ఎంట్రీ లభించింది. కెరీర్ ఆరంభంలోనే నితిన్ కి స్టార్ హీరో రేంజ్ లోనే క్రేజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత నితిన్ కి పదేళ్ల పాటు హిట్లు లేవు. కెరీర్ క్లోజ్ అయ్యే టైంలో ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇప్పుడు కూడా నితిన్ కెరీర్ పరిస్థితి దాదాపు అలాగే ఉంది.