కార్తీక దీపం డాక్టర్ బాబు పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా? నిరుపమ్ కంటే ముందు ఎవరిని అనకున్నారు?

Published : Apr 07, 2026, 10:55 AM IST

కార్తీక దీపం సీరియల్ అనగానే గుర్తొచ్చేవారు డాక్టర్ బాబు, వంటలక్క. డాక్టర్ బాబు క్యారెక్టర్ చేస్తున్న నిరుపమ్ పరిటాలకు ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ పాత్ర కోసం ముందుగా నిరుపమ్ ను తీసుకోలేదని మీకు తెలుసా?

PREV
15
బుల్లితెర హీరోగా నిరుపమ్ కు భారీ ఫాలోయింగ్..

తెలుగు బుల్లితెరపై భారీ విజయాన్ని సాధించిన సీరియల్స్‌లో కార్తీక దీపం ఒకటి. ఈ సీరియల్ వల్ల డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల ‌- వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ మంచి గుర్తింపు సంపాదించారు. కార్తీక దీపం సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. 

వెండితెరపై స్టార్ హీరోలకు ఎంత మంది అభిమానులు ఉంటారో.. బుల్లితెరపై కార్తీక దీపం డాక్టర్ బాబుకు కూడా అంతే ఇమేజ్, ఫాలోయింగ్ ఉంది. మరీ ముఖ్యంగా మహిళా అభిమానుల్లలో డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాలకు చాలా ఫాలోయింగ్ ఉంది.

25
టాప్ లో దూసుకుపోతున్న కార్తీక దీపం 2

ఇక కార్తీక దీపం సీరియల్ కు సబంధించి ఏ వార్త వచ్చినా అది వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పటికీ ఈ సీరియల్ సెకండ్ సీజన్ కూడా టాప్ టిఆర్పీతో దూసుకుపోతోంది. ఈక్రమంలో కార్తీక దీపం సీరియల్ కు సబంధించిన చాలా విషయంలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

రీసెంట్ గా ఈ సీరియల్ మెయిన్ హీరో డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో నిరుపమ్ పరిటాల ఈ సీరియల్‌కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. . ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్‌లో హీరోగా తన ఎంపిక ఎలా జరిగిందనే విషయంపై ఆయన మాట్లాడారు.

35
డాక్టర్ బాబు పాత్ర కోసం..

నిరుపమ్ పరిటాల మాట్లాడుతూ, “కార్తీక దీపం సీరియల్‌కు మొదట హీరోగా నేను ఎంపిక కాలేదు. చానల్స్‌లో కొన్ని రూల్స్ ఉండటం.. నేను కూడా నా పర్సనల్ గా కొన్ని షరతులు పెట్టడంతో.. వారు నన్ను వద్దని నిర్ణయించారు. చానల్ వారు కూడా నన్ను ఈ ప్రాజెక్ట్‌కు తీసుకోవద్దని భావించారు. అంతే కాదు ఈ సీరియల్ కు హీరోను వెతకే పని కూడా నాకే అప్పగించారు. నేను కూడా కొంతమంది నటులను రిఫర్ చేశాను. వారితో ఆడిషన్స్ కూడా నిర్వహించారు. కానీ ఎవ్వరూ ఫైనల్ కాలేదు,”

45
నిరుపమ్ ను వ్యతిరేకించింది ఎవరు?

నిరుపమ్ మాట్లాడుతూ.. సీరియల్ హీరోగా ఎవరు సెట్ అవ్వకపోవడంతో.. “చివరికి నిర్మాతలు నన్నే ట్రై చేయమని అడిగారు. మొదట చానల్ వారు ఒప్పుకోకపోయినా, తరువాత అంగీకరించారు. అలా నేను ఈ సీరియల్‌లో హీరోగా సెలక్ట్ అయ్యాను. ఇది అసలు మలయాళం సీరియల్‌కు రీమేక్. అయితే అక్కడి కథను పూర్తిగా అనుసరించకుండా, బేసిక్ లైన్ మాత్రమే తీసుకుని తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొత్తగా రూపొందించారు ” అని చెప్పారు.

55
సీజన్ 2 ని కార్తీక్ ఎందుకు వద్దన్నారు?

కార్తీక దీపం సీజన్ 2 గురించి కూడా నిరుపమ్ కొన్ని ముఖ్య విషయాలు చెప్పారు. “ఈ సీరియల్‌కు సీజన్ 2 తీసుకురావాలనే ఆలోచన మొదట లేదు. నిర్మాణ సంస్థకు కొత్త ఆలోచన రావడంతో అదే పేరుతో కొత్త కథను ప్రారంభించారు. నాకు మొదట ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు నేను అంగీకరించలేదు. సీజన్ 2 ఎప్పుడూ రిస్క్‌తో కూడుకున్నది. కానీ చివరికి తెలియకుండానే ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాను.

 సీజన్ 2లో నేను ‌- ప్రేమి విశ్వనాథ్ మాత్రమే సీజన్ 1 నుంచి కొనసాగుతున్నాం. మిగతా యాక్టర్స్ అంతా పూర్తిగా కొత్తవాళ్లు. ఇది సీజన్ 1కి కొనసాగింపు కాదు, పూర్తిగా కొత్త కథ. మొదట కాస్త కష్టంగా అనిపించినా, ఇప్పుడు ఈ సీరియల్ టాప్ లో కొనసాగుతోంది. ” అని నిరుపమ్ పరిటాల వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories