Karthika Deepam: షాకింగ్ ట్విస్ట్.. హిమకు క్యాన్సర్.. ఎక్కువ రోజులు బ్రతకదని తెలుసుకున్న నిరుపమ్!

Published : Jun 08, 2022, 08:01 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్(Karthika Deepam) కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Karthika Deepam: షాకింగ్ ట్విస్ట్.. హిమకు క్యాన్సర్.. ఎక్కువ రోజులు బ్రతకదని తెలుసుకున్న నిరుపమ్!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే సత్య (Sathya) జ్వాల తో ఇక మీదట లంచ్ బాక్సులు తేవడం ఆపేయ్ అమ్మా అని అంటాడు. ఇక జ్వాల (Jwala) హిమలు ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ శోభ వెళ్లి మీరిద్దరూ చేయలేనిది నేను చేశాను అని అంటుంది. వాళ్ల కుటుంబాన్ని కలిపాను ఆ కుటుంబానికే కోడలిగా వెళతాను అని అంటుంది. దాంతో వాళ్ళిద్దరూ ఒకసారిగా స్టన్ అవుతారు.
 

26

ఈలోపు అక్కడ స్వప్న (Swapna) వచ్చి శోభ మా కుటుంబాన్ని కలిపింది..  రేపు మా కుటుంబంలో ఒకటి కాబోతుంది అని అంటుంది. ఇక జ్వాలను నానా రకాలుగా అవమాన పరుస్తుంది. ఆ తర్వాత జ్వాల (Jwala) డాక్టర్ సాబ్ మనసులో నేను ఉన్నా.. ఎవరు ఎన్ని చాలెంజ్ చేసినా మనకేం భయం లేదని హిమ కు ధైర్యం చెబుతుంది.
 

36

ఇక జ్వాల (Jwala) నేనంటే డాక్టర్ సాబ్ కి చాలా ఇష్టమని గొప్పగా చెబుతుంది. ఆ మాటలు విన్న హిమ (Hima) అసలు నిజం నీకు ఎలా చెప్పాలి అంటూ..  బాధపడుతూ ఉంటుంది. ఇక స్వప్న శోభలు కారులో వెళుతుండగా హిమ జ్వాల లను చూస్తారు. ఇక స్వప్న ఒకవైపు హిమ.. రెండోవైపు జ్వాల  నిరుపమ్ కి పీడలా డపరించారు అని అంటుంది. ఇక నిరూపమ్ హిమ నన్ను ఎందుకు కాదన్నదో తెల్చేస్తాను అని అనుకుంటాడు.
 

46

ఇక హిమ (Hima) జ్వాల లు కలిసి రాగ నిరుపమ్ (Nirupam) కోపం వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఆ కోపాన్ని చూసిన జ్వాల నిజంగా మమ్మల్ని కలవడానికి వచ్చావా? లేక విడగొట్టడానికా అని హిమను అడుగుతుంది. ఇక ఇద్దరు లవర్స్ మధ్య మూడో మనిషి ఉండకూడదని.. నీకు తెలియదా తింగరి అని జ్వాల అంటుంది. అయినా నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ఇదంతా తెలుస్తుంది అని అంటుంది.
 

56

ఇక నేను నీ మొహం మీద వద్దని చెబుతున్నా.. మా ఇద్దరి మధ్య ఎందుకు ఎందుకు దూరుతున్నావ్? అని జ్వాల (Jwala) హిమను అంటుంది. ఇక మనసులో బావకు నీపైన ఇష్టం లేదని.. నీకెక్కడ తెలుస్తుందో అన్న భయంతో  నేను వస్తున్నాను అని అనుకుంటుంది హిమ. నిరుపమ్ (Nirupam) నేను అమెరికా వెళదాము అనుకుంటున్నాను అని అనగా..  దాంతో హిమ సౌర్య లు స్టన్ అవుతారు.
 

66

ఇక తరువాయి భాగం లో హిమ (Hima) కు క్యాన్సర్ అని నిరుపమ్ (Nirupam) కి తెలుస్తుంది. ఇక నీ కోసం నా ప్రాణాలు అడ్డుగా వేస్తాను హిమ అని నిరుపమ్ అంటాడు. దాంతో హిమ ఎన్నో రోజులు బతకాలని నన్ను నువ్వు ప్రేమించడం ఏమిటి?  బావ అని అడుగుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories