18pages OTT Rights.. షాకింగ్‌ రేట్ కి దక్కించుకున్న ప్రముఖ సంస్థ.. రిలీజ్‌ కు ముందే ప్రాఫిట్‌.. నిఖిలా మజాకా!

Published : Dec 19, 2022, 10:02 AM ISTUpdated : Dec 19, 2022, 12:09 PM IST

హీరో నిఖిల్‌ `కార్తికేయ2`తో పాన్‌ ఇండియా హీరోల జాబితాలో చేరిపోయాడు. సైలెంట్‌గా బాక్సాఫీసుని షేక్‌ చేసి అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు `18పేజెస్‌` సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఓటీటీ డిటెయిల్స్ షాకిస్తున్నాయి. 

PREV
15
18pages OTT Rights.. షాకింగ్‌ రేట్ కి దక్కించుకున్న ప్రముఖ సంస్థ.. రిలీజ్‌ కు ముందే ప్రాఫిట్‌.. నిఖిలా మజాకా!

`కార్తికేయ2`సక్సెస్‌తో నిఖిల్‌(Nikhil) మార్కెట్‌ భారీగా పెరిగింది. ఇప్పుడు పాన్‌ ఇండియా హీరో అయిపోయారు. నార్త్ లో ఆయనకు మంచి మార్కెట్‌ ఏర్పడింది. దీంతో ఆయన నుంచే వచ్చే సినిమాలకు భారీ డిమాండ్‌ ఉంటుంది. ఇప్పుడు నిఖిల్‌ `18పేజెస్‌` (18 Pages) చిత్రంతో రాబోతున్నారు. పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. అల్లు అరవింద్‌ సమర్పణలో సుకుమార్‌ రైటింగ్స్ నుంచి, గీతా ఆర్ట్స్ బ్యానర్ల నుంచి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) హీరోయిన్‌ కావడం కూడా ఈ సినిమా అందరి అటెన్షన్‌ గ్రాస్ప్ చేస్తుంది. 

25

డిఫరెంట్‌ లవ్‌ స్టోరీతో తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. ట్రైలర్‌కి మించిన కంటెంట్‌ సినిమాలో ఉంటుందని హీరో నిఖిల్‌, చిత్ర బృందం చెబుతోంది. ఈ నెల 23న సినిమా రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఓటీటీ డిటెయిల్స్  ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 

35

ఈ సినిమా ఓటీటీ, డిజిటల్‌ రైట్స్ (18 Pages OTT Rights) భారీ రేటుకు అమ్ముడు పోయాయట. ఓటీటీ, డిజిటల్‌ రైట్స్ మొత్తం సుమారు 18నుంచి 20కోట్ల వరకు అమ్ముడు పోయాయని ఫిల్మ్ నగర్‌ టాక్‌. నెట్‌ ఫ్లిక్స్ ప్రధానంగా ఓటీటీ రైట్స్ దక్కించుకుందట. శాటిలైట్‌ రైట్స్ ని ప్రముఖ ఎంటర్టైన్‌మెంట్‌ సంస్థ దక్కించుకుందని తెలుస్తుంది. కేవలం ఓటీటీ, డిజిటల్‌ రైట్స్ తోనే ఈ సినిమా ప్రాఫిట్‌లోకి వెళ్లిందని సమాచారం. 

45

ఈ సినిమా బడ్జెట్‌ కేవలం రూ.12కోట్లలోపే అయ్యిందని తెలుస్తుంది. `కార్తికేయ2` సినిమాకి ముందు చేసిన చిత్రం కావడంతో నిఖిల్‌ పారితోషికం, సినిమా బడ్జెట్‌ కూడా తక్కువే అయ్యిందని టాక్‌. బడ్జెట్‌ తో పోలిస్తే 50శాతం ప్రాఫిట్‌లోకి వెళ్లిందని, ఇక థియేటర్‌ కలెక్షన్లు అదనంగా యాడ్‌ కాబోతున్నాయి. గీతా ఆర్ట్స్ సొంత రిలీజ్‌ కావడం కూడా ప్లస్ కాబోతుంది. దీంతో విడుదలకు ముందే `18పేజెస్‌` ప్రాఫిట్‌లో రన్‌ అవుతుంది. ఇటీవల కాలంలో ఇంతటి ప్రాఫిట్‌తో రిలీజ్‌ కాబోతున్న సినిమా ఇదే కాబోతుండటం విశేషం. 
 

55

దీనంతటికి నిఖిల్‌ పాన్‌ ఇండియా మార్కెట్‌ మెయిన్‌ కారణమని తెలుస్తుంది. అలాగే గీతా ఆర్ట్స్, సుకుమార్‌ రైటింగ్‌, అనుపమా పరమేశ్వరన్‌ అదనంగా యాడ్‌ కాబోతున్నారు. మొత్తంగా ఈ చిత్రం లాభాల్లో సాగుతుంది. సినిమా హిట్‌ అయితే కలెక్షన్ల పరంగానూ ఇది దుమ్ములేపబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టీమ్‌ కూడా ఈ విషయంలో చాలా నమ్మకంతో ఉన్నారు. దర్శకుడు సూర్య ప్రతాప్‌, సుకుమార్‌ బ్యాకెండ్‌ ఉండటంతో మినిమమ్‌ గ్యారెంటీ అనేది ఆల్‌రెడీ జనాల్లోకి వెళ్లిపోయింది. ఇక రిలీజ్‌ అయి ఫలితం కోసం వేచి చూడటమే మిగిలిందని చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories