నిఖిల్ మీద అంత బడ్జెట్ పెడుతున్నారా? రికవరీ ఎలా

Published : Jan 28, 2025, 11:47 AM IST

కార్తికేయ 2 తర్వాత హిట్ కోసం చూస్తున్న నిఖిల్, భారీ బడ్జెట్ తో స్వయంభూ సినిమా చేస్తున్నారు. 

PREV
14
 నిఖిల్ మీద అంత బడ్జెట్ పెడుతున్నారా? రికవరీ ఎలా
Actor Nikhil Siddhartha Swayambhu


యంగ్‌ హీరో నిఖిల్‌ (Nikhil) ‘కార్తికేయ2’తో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవటంతో బిజినెస్ వర్గాల్లో క్రేజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఆ తర్వాత అతను చేసిన 18 పేజీస్‌, స్పై సినిమాలు ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాయి.

అయితే ఇప్పుడు మళ్లీ పాన్‌ ఇండియా మూవీతోనే హిట్‌ కొట్టడానికి రెడీ అవుతున్నాడీ యంగ్‌ హీరో. ఈ క్రమంలో మరో విభిన్నమైన కథతో అలరించడానికి సిద్ధమయ్యారు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘స్వయంభూ’ (Swayambhu)లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే ఈ సినిమాకు పెడుతున్న బడ్జెట్.
 

24
Nikhil Siddhartha


ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ 'స్వయంభూస చిత్రాన్ని అత్యున్నత ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ స్టాండర్డ్స్ తో నిర్మిస్తున్నారు.దాని ప్రొడక్షన్ వాల్యూస్  కారణంగా దాని బడ్జెట్‌ను మించిపోయిందని తెలుస్తోంది. ఈ చిత్రం బడ్జెట్ ₹60 కోట్లు దాటిందని, ఇది నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన వెంచర్‌గా మారిందని ప్రాజెక్ట్‌కి సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అయితే నిఖిల్ మీద ఇంత బడ్జెట్ పెరిగితే రికవరీ ఏ స్దాయిలో ఉంటుందనేది ట్రేడ్ లో చర్చగా మారింది. 

34


 స్వయంభూ సినిమా షూటింగ్‌ నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. ఈ సినిమాలో నిఖిల్ హనుమాన్‌ భక్తుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళం సెన్సేషన్‌ సంయుక్తా మేనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకున్నాడు నిఖిల్‌. ఒక హిస్టారికల్‌ సబ్జెక్ట్‌ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శత్రువులను చీల్చి చెండాడే యుద్ద వీరుడిగా కనిపించనున్నాడీ యంగ్ హీరో. ఇందుకోసం కత్తి తిప్పడంలో కూడా శిక్షణ తీసుకుంటున్నారు. ఈ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటోన్న నిఖిల్‌ తన సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు. 

44


ఈ సినిమాలో నిఖిల్ (Nikhil) లెజెండరీ వారియర్ పాత్రను పోషిస్తుండ‌గా ఆ పాత్ర కోసం ఆయ‌న ప్ర‌త్యేక శిక్ష‌ణ కూడా తీసుకోవ‌డం విశేషం. సంయుక్త (Samyuktha), నభా నటేష్ (Nabha Natesh) హీరోయిన్స్ గా నటిస్తుండ‌గా రవి బస్రూర్ సంగీతం, కెకె సెంథిల్ కుమార్ (KK Senthil Kumar ISC) సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాకరన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా చేస్తున్నారు.

click me!

Recommended Stories