రెట్రో లుక్‌లో సూపర్‌ హాట్‌గా నిహారిక.. విడాకుల వార్తల నేపథ్యంలో మెగా డాటర్‌ షాకిచ్చే నిర్ణయం.. హాట్‌ టాపిక్‌

మెగా డాటర్‌ ఓ మధ్య కాస్త హాట్‌గా కనిపించి, ఆ తర్వాత తగ్గించింది. ఇటీవల భర్తతో విడాకుల రూమర్లతో వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి టూ హాట్‌గా కనిపించడం సంచలనంగా మారింది. 
 

niharika shared black and white retro look photos her taking shocking decision arj

మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక గ్లామర్‌ విషయంలో దూరంగానే ఉంటూ వచ్చారు. సినిమాల్లోనూ ఆమె ట్రెడిషనల్‌గానే కనిపించారు. ట్రెండీగా కనిపించినా, ఎక్కడా హద్దులు దాటలేదు. పెళ్లి తర్వాత కొన్ని సార్లు కాస్త హాట్‌ గా ఫోటో షూట్లు చేసింది. కానీ మళ్లీ వాటి జోలికెళ్లలేదు. కానీ ఇప్పుడు మరోసారి ఆమె రెచ్చిపోయింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఆమె హాట్‌ పోజులిస్తూ మతిపోగొడుతుంది. 

ఎర్ర చీర కట్టి పిల్లర్‌ వద్ద కూర్చొని నిహారిక ఇచ్చిన పోజులు మతిపోగొట్టేలా ఉన్నాయి. కిల్లర్‌ లుక్‌లో మతిపోగొడుతుంది. అమాయకంగా కనిపిస్తూ కట్టిపడేస్తుంది. విరహంతో చూస్తూ మత్తెక్కిస్తుంది. మొత్తంగా నిహారిక తనలోని అన్ని యాంగిల్స్ ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఓ వైపు విడాకుల రూమర్లు వినిపిస్తున్న నేపథ్యంలో నిహారిక ఇలాంటి ఫోటోలు పంచుకోవడం షాకిస్తుంది. 
 


దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు.. వింటేజ్‌ లుక్‌లో నిహారిక మైండ్‌ బ్లాక్‌ అని, బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో టూ హాట్‌ అని, సూపర్‌ లుక్‌ అని, నిహారిక ఈజ్‌ బ్యాక్‌ అంటున్నారు. ఇంత క్యూట్‌గా, హాట్‌గా ఎలా సాధ్యం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు విడాకులకు సంబంధించిన పోస్టులు కూడా పెడుతూ నానా రచ్చ చేస్తున్నారు. 
 

అయితే చాలా రోజుల తర్వాత నిహారిక ఇలా హాట్‌గా ఫోటో షూట్ చేయడమే ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకు ఇలాంటి ఫోటో షూట్‌ చేసిందనేది ఆసక్తిగా మారింది. సినిమా ప్లానేమైనా ఉందా? అనే సందేహాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె తన నిర్మాణంలో వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తుంది. 
 

ఇక రెండేళ్ల క్రితం గుంటూరుకి చెందిన వెంకట చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కోట్లు పెట్టి అంగరంగ వైభవంగా వీరిద్దరి వివాహం జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో మ్యారేజ్‌ వేడుక జరగడం విశేషం. ఆయా ఫోటోలు అప్పట్లో వైరల్‌ అయ్యాయి. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా నిహారిక, చైతన్య మధ్య మనస్పర్థాలు తలెత్తాయని, వీరిద్దరు విడిపోతున్నారనే పుకార్లు ఊపందుకున్నాయి. 
 

భర్త చైతన్య జొన్నలగడ్డ తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి పెళ్లి ఫోటోలను డిలీట్‌ చేశాడు. అంతేకాదు నిహారికా నుంచి అన్‌ ఫాలో అయ్యాడు. అలాగే నిహారిక కూడా చైతన్య నుంచి అన్‌ ఫాలో అయ్యింది. దీంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై ఇప్పటి ఎవరూ స్పందించలేదు. దీంతో విడాకుల వార్తలు నిజమే అనే ప్రచారం ఊపందుకుంది. 

అయితే నిహారిక ఫాదర్‌ నాగబాబు ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. అయితే చిరంజీవి రంగంలోకి దిగారని, ఇద్దరి మధ్య రాజీకుదిర్చే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఆయన పెద్దరికం తీసుకుని సెటిల్‌ చేస్తున్నారని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు వచ్చిందనేది తెలియాల్సి ఉంది. 
 

ఇదిలా ఉంటే మొదట నిహారిక భర్త చైతన్య తమ పెళ్లి ఫోటోలు డిలీట్‌ చేశాడు. అప్పుడు నిహారిక పెళ్లి ఫోటోలను డిలీట్‌ చేయలేదు. కానీ ఇప్పుడు ఆమె కూడా డిలీజ్‌ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టా అకౌంట్‌లో వీరి పెళ్ళి ఫోటోలు లేవు. దీంతో వీరి విడాకుల రూమర్లకి మరింత బలం చేకూరినట్టయ్యింది. మరి ఏం జరగబోతుందనేది వేచి చూడాలి. 
 

Latest Videos

vuukle one pixel image
click me!