Niharika NM: మహేష్‌ బాబు, టామ్‌ క్రూజ్‌.. ఇద్దరితో ఒకేసారి ఛాన్స్.. నిహారిక రొమాన్స్ ఆయనతోనే

Published : Oct 11, 2025, 02:36 PM IST

Niharika NM: యూట్యూబర్‌ నుంచి హీరోయిన్‌గా మారిన నిహారిక ఏకంగా మహేష్‌ బాబు, హాలీవుడ్‌ స్టార్‌ టామ్ క్రూజ్‌తో కలిసి ఆ మధ్య రచ్చ చేసింది. అయితే ఇద్దరితో కలిసి నటించే అవకాశం ఒకేసారి వస్తే ఏం చేస్తుందో ఆమె వెల్లడించింది. 

PREV
14
హీరోయిన్‌గా పరిచయం అవుతున్న యూట్యూబర్ నిహారిక

యూట్యూబర్‌గా సోషల్‌ మీడియా ద్వారా పాపులర్‌ అయ్యింది నిహారిక ఎన్‌ఎం. యూట్యూబ్‌ లో ఫన్నీ వీడియోలతో విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఆ క్రేజే ఆమెని సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుని, హాలీవుడ్‌ స్టార్‌ టామ్‌ క్రూజ్‌ని కలిసేలా చేసింది. ఈ క్రమంలో తాజాగా నిహారిక హీరోయిన్‌గా మారింది. ఆమె ఇప్పటికే తమిళంలో ఓ చిత్రంలో నటించింది. ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అవుతుంది. ఆమె హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ తెలుగు సినిమా `మిత్ర మండలి`లో ప్రియదర్శి, రాగ్‌ మయూర్‌, సత్య, వెన్నెల కిశోర్‌, విష్ణు, ప్రసాద్‌ బెహరీ ప్రధాన పాత్రలు పోషించారు. విజయేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. బన్నీవాస్‌ సమర్పణలో బీవీవర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌ మంథిన, భాను ప్రతాప్‌, డా. విజేందర్‌ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 16న విడుదల కాబోతుంది.

24
మహేష్‌ బాబు, టామ్‌ క్రూజ్‌తో ఆఫర్‌పై నిహారికా క్రేజీ కామెంట్స్

`మిత్ర మండలి` చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఏషియానెట్‌ న్యూస్‌ తెలుగు ప్రతినిధి రాజు నిహారికతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇందులో నిహారిక మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. అందులో భాగంగా ఒకేసారి మహేష్‌ బాబుతో, అలాగే టామ్‌ క్రూజ్‌తో కలిసి నటించే అవకాశం వస్తే ఎవరికి ప్రయారిటీ ఇస్తారనే ప్రశ్నకి క్రేజీగా సమాధానం చెప్పింది నిహారిక. రాజమౌళి లాంటి దర్శకుడు అయితే మహేష్‌ బాబుతోనే సినిమా చేయడానికి రెడీ అని తెలిపింది. హాలీవుడ్‌ స్టార్‌ అయినా తాను మహేష్‌తో రొమాన్స్ కే ప్రయారిటీ ఇస్తానని చెప్పింది. అయితే అవకాశం ఉంటే ఒకేసారి ఇద్దరితోనూ కలిసి నటించేందుకు సిద్ధమే అని వెల్లడించడం విశేషం. నిహారిక `మేజర్‌` సినిమా సమయంలో మహేష్‌ బాబుతో కలిసి ప్రమోషనల్‌ వీడియోస్‌ చేసింది. ఈ సందర్భంగా మహేష్‌ గురించి అడిగిన ప్రశ్నకి ఆమె స్పందిస్తూ, మహేష్‌  చాలా కూల్‌ పర్సన్‌ అని, ఎంత పెద్ద సూపర్‌ స్టార్‌ అయినా సింపుల్‌గా ఉంటారని, ఆయనలో తనకు ఆ సింప్లిసిటీ అంటే బాగా నచ్చిందని తెలిపింది నిహారిక. ఆయన చాలా కూల్‌గా ఉంటాడని, రీల్స్ కోసం కూడా ఎన్ని టేకులంటే అన్ని టేకులు చేశారు, ఆయన డిడికేషన్‌కి ఫిదా అయినట్టు తెలిపింది నిహారిక.

34
కామెడీ కాదు, యాక్టింగ్‌ చేయగలదా అనే డౌట్‌ ఉండేది

అలాగే యూకేలో జరిగిన `మిషన్‌ ఇంపాజిబుల్‌ః ది ఫైనల్‌ రెకొనింగ్‌` మూవీ ప్రీమియర్స్ లో హాలీవుడ్‌ స్టార్‌ టామ్‌ క్రూజ్‌తో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంది. దీంతో ఆమె మరింత పాపులర్‌ అయ్యింది. స్టార్‌ యూట్యూబర్‌ కాస్త ఇప్పుడు హీరోయిన్‌గా మారి తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తోంది. ఈ క్రమంలో తాను యూట్యూబర్‌ నుంచి హీరోయిన్‌గా మారే క్రమంలో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. మీ లైఫ్‌లో ఉన్నాయా అనే ప్రశ్నకి నిహారిక స్పందిస్తూ `ఈమె చేయగలదా లేదా అనే అనుమానాలుంటాయి. కామెడీ చేస్తుంది. కానీ మిగిలినవి చేయగలదా, బాగా యాక్ట్ చేయగలదా అనే డౌట్లు ఉంటాయి. ఇప్పుడే కాదు యూట్యూబర్‌గా ఉన్నప్పుడు కూడా అలాంటివి ఫేస్‌ చేశాను. కానీ ఇండస్ట్రీలో చిన్నచూపు అనేది పెద్దగా ఫేస్‌ చేయలేద`ని తెలిపింది నిహారిక. తనకు వచ్చిన ఆఫర్స్ లో  మేకర్సే తనని అప్రోచ్‌ అయ్యారని, లుక్‌ టెస్ట్ చేశారు. వాళ్లు అనుకున్నట్టుగా లేకపోతే మళ్లీ ట్రై చేద్దామని మర్యాదగానే చెప్పారు, అందులో చిన్న చూపు ఏం లేదని వెల్లడించింది నిహారిక.

44
`మిత్ర మండలి`కి వస్తే హాయిగా నవ్వుకోవచ్చు

ఇక తాను హీరోయిన్‌గా నటిస్తోన్న `మిత్ర మండలి` సినిమా గురించి నిహారిక మాట్లాడుతూ, `ఇదొక మంచి కామెడీ మూవీ. థియేటర్‌కి వచ్చి హాయిగా నవ్వుకునేలా ఉంటుంది. తన తిక్కకి తగ్గట్టుగా ఉండే మూవీ. ఆద్యంతం ఫన్నీగా సాగుతుంది. తన పాత్ర కూడా చూడ్డానికి సాఫ్ట్ గా ఉంటుంది, అదే సమయంలో క్రేజీగా ఉంటుంది. అదే సమయంలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇన్ ఫ్లూయెన్సర్‌గా నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది. సినిమాల్లో నటించడం చాలా కొత్తగా, ఆనందంగా ఉంది. ప్రియదర్శి చాలా మంచి వ్యక్తి. అద్భుతమైన నటుడు. ‘మిత్ర మండలి’ షూటింగ్‌లో ఉండగానే ప్రియదర్శి నటించిన ‘కోర్ట్’ చిత్రం పెద్ద హిట్ అయింది. ప్రియదర్శి ఎంత సక్సెస్ అయినా కూడా ఒదిగి ఉంటారు. నాకు అన్ని కూడా కామెడీ బేస్డ్ చిత్రాలే వస్తున్నాయి. అందుకే డిఫరెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకోవాలని చూస్తున్నాను. కామెడీ ప్రధాన చిత్రాలే అంటే నేను నా ఇన్ స్టాగ్రాంలో రీల్స్ చేసుకుంటాను కదా (నవ్వుతూ). తనకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. కాకపోతే యాక్షన్‌ మూవీస్‌, పీరియాడికల్‌ చిత్రాలంటే ఇష్టం` అని చెప్పింది నిహారిక.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories