కారును అలా మార్చేసిన నిహారిక... మా నాన్న అయితే చెప్పుతో కొట్టేవాడంటూ నెటిజెన్స్ కామెంట్స్ 

Published : Jun 26, 2023, 12:55 PM IST

మెగా డాటర్ నిహారిక తీరు షాక్ ఇస్తుంది. ఈ మధ్య వరుస ఫోటో షూట్స్ తో ఆమె హోరెత్తిస్తున్నారు. అల్ట్రా స్టైలిష్ గెటప్స్ లో మైండ్ బ్లాక్ చేస్తుంది.   

PREV
16
కారును అలా మార్చేసిన నిహారిక... మా నాన్న అయితే చెప్పుతో కొట్టేవాడంటూ నెటిజెన్స్ కామెంట్స్ 
Niharika Konidela

తాజాగా కారులో భిన్నమైన ఫోజులో నిహారిక దర్శనమిచ్చింది. కారును స్టూడియోగా మార్చేశానని ఆ ఫోటోకు వివరణ ఇచ్చింది.  నిహారిక లుక్ పై నెటిజన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. అలా హెడ్ రెస్ట్ మీద కాలు పెడితే మా నాన్న అయితే నా చెప్పుతోనే కొట్టేవాడు, అని కామెంట్ చేశాడు. మరికొందరు ఇంకొన్ని కామెంట్స్ పోస్ట్ చేశారు.

26
Niharika Konidela

కెరీర్ పై దృష్టి పెట్టిన  'డెడ్ పిక్సెల్స్' టైటిల్ తో నిహారిక ఓ వెబ్ సిరీస్ చేశారు. హాట్ స్టార్ లో మే 19 నుండి ఇది స్ట్రీమ్అవుతుంది. డెడ్ పిక్సెల్స్ సిరీస్ ఓ వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కింది. ఆన్లైన్ గేమ్స్ యూత్ ని ఊపేస్తున్నాయి. ఈ గేమ్ పార్టనర్స్ లైఫ్ పార్టనర్స్ గా కూడా మారిపోతున్నారు. ఆ కాన్సెప్ట్ తో డెడ్ పిక్సెల్స్ తెరకెక్కింది.

36
Niharika Konidela


నిహారిక ఈ సిరీస్లో గాయత్రి అనే రోల్ చేశారు. తనతో పాటు ఆన్లైన్ గేమ్ ఆడే పాత్రల్లో అక్షయ్ లాగుసాని, వైవా హర్ష నటించారు. ఇద్దరి వ్యక్తులను ఇష్టపడే అమ్మాయిగా నిహారిక క్యారెక్టర్ చూపించారు. డెడ్ ఫిక్సెల్ గురించి ఆడియన్స్ పెద్దగా మాట్లాడుకుంది లేదు. 
 

46

కొద్దిరోజులుగా నిహారిక విడాకులు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నిహారిక-వెంకట చైతన్య ఈ మధ్య కాలంలో కలిసినదాఖలాలు. లేవు. మార్చిలో వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన నేపథ్యంలో ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ వాదనలకు బలం చేకూర్చుతూ నిహారిక సైతం పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ నుండి తొలగించారు. నిహారిక-వెంకట చైతన్య విడాకులు ఖాయమేనని చిత్ర వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. 
 

56

అలాగే నిహారిక కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నారు. హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేశారు. నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ఆమె పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ బ్యానర్ లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ మూవీస్ నిర్మిస్తున్నారు. తన నిర్మాణ సంస్థను ఆమె మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. ఇందు కోసం ఓ ఆఫీస్ ఓపెన్ చేశారు. 

 

 

66

కాగా నిహారిక ఇంట్లో పెళ్లి బాజా మోగనుంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ వివాహం చేసుబోతున్నారు. జూన్ 9న వీరికి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది చివర్లో వివాహం చేయనున్నారని సమాచారం. 

 

click me!

Recommended Stories