ఆ మేటర్ లో కత్రినా కైఫ్ చాలా మారిపోయిందిగా.! బ్లాక్ శారీలో ఎంత ముందుగా ఉందో చూడండి.!

First Published | Dec 2, 2023, 1:26 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తోంది. అయితే కొన్నాళ్లుగా తను ఆ ఒక్క విషయంలో కట్టుబడి ఉంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పోస్టులు ఆసక్తికరంగా మారాయి. 
 

బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ (Katrina Kaif)  ప్రస్తుతం సినిమాల జోరును తగ్గించింది. తన సైన్ చేసిన సినిమాల్లో మాత్రం నటిస్తూ వస్తోంది. చివరిగా ఈ ముద్దుగుమ్మ ‘టైగర్ 3’ చిత్రంతో అలరించింది. నెక్ట్స్ మరో సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతోంది. 
 

కత్రినా సినిమాల విషయంలో కాస్తా స్పీడ్ తగ్గించడం చూస్తూనే ఉన్నాం. అయితే, ఈ ముద్దుగుమ్మ మునుపటి లాగా వెండితెరపై గ్లామర్ ఒళకబోసేందుకు సిద్ధంగా లేదు. తన పాత్ర చాలా కీలకమై, విభిన్నంగా ఉంటేనే నటించేందుకు ఒప్పుకుంటోంది. యాక్షన్ సంబంధించిన రోల్స్ లోనూ అలరిస్తోంది. 
 


ముఖ్యంగా తన పెళ్లి తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌషల్ (Vicky Kaushal)తో రెండేళ్ల  కింద 2021లో డిసెంబర్ 9న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి జోరుగా గ్లామర్ పిక్స్ షేర్ చేసింది. కానీ కొద్దికాలంగా కత్రినా పోస్టులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. 
 

మునుపటిలాగా గ్లామర్ ట్రీట్ కు తెర దించేసింది. ఎలాంటి సినీ ఫంక్షన్లు అయినా, ట్రెడిషనల్ ఈవెంట్స్ కైనా ఈ ముద్దుగుమ్మ చాలా పద్ధతిగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ సంప్రదాయంగానే కనిపిస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు హాట్ నెస్ తో మతులు పోగొట్టిన కత్రినా కైఫ్ కొన్నాళ్లుగా రూటు మార్చి పద్దతిగా దర్శనమిస్తోంది.
 

అభిమానులు సైతం ఆమెను నిండుగా చూసేందుకే ఇష్టపడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె తరుచుగా పంచుకుంటున్న బ్యూటీఫుల్ శారీ ఫొటోస్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఎంత ముద్దుగా ఉందో అంటూ పొగుడుతున్నారు. తాజా పిక్స్ నూ వైరల్ గా మార్చారు. 
 

తాజాగా కత్రినా బ్లాక్ శారీలో, ఫుల్ స్లీవ్ బ్లౌజ్ లో మెరిసింది. క్యూట్ గా ఫొటోలకు ఫోజులిచ్చి మంత్రముగ్ధులను చేసింది. చీరకట్టుకే అందం తెచ్చిన కత్రినా కైఫ్ బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. ఇక రీసెంట్ గా కత్రినా ‘టైగర్3’తో అలరించింది. నెక్ట్స్ ‘మెరీ క్రిస్టమస్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest Videos

click me!