నిహారిక తన హొలీ సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.
సోమవారం హోలీ వేడుకను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. టాలీవుడ్ సెలెబ్స్ కూడా ఈ హోలీ వేడుకలలో సందడి చేయడం జరిగింది.
యువ జంట నిహారిక, చైతన్యలు కూడా తమ మిత్రులు, బంధువులలో కలిసి హోలీ వేడుకలలో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను మనస్ఫూర్తిగా ఆస్వాదించారు.
దంపతులు ఇద్దరూ వైట్ కాంబినేషన్ టి షర్ట్స్ లో ఇరగదీశాడు. ముఖ్యంగా నిహారిక హోలీ డ్రెస్ లో గ్లామరస్ గా కనిపించారు.
2020 డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న నిహారిక, చైతన్య హ్యాపీ కపుల్ గా కలర్ ఫుల్ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. భర్త కంటే కూడా అత్తమ్మ తనను బాగా చూసుకుంటున్నారని నిహారిక చెప్పడం విశేషం.
పెళ్లి తరువాత కూడా యాక్టింగ్ ప్రొఫెషన్ కొనసాగిస్తున్నారు నిహారిక. విజయ్ సేతుపతి జంటగా నిహారిక ఓ చిత్రంలో నటించారు. ఇది తమిళ్, తెలుగు బాషలలో విడుదల కానుంది.
అలాగే ఓ వెబ్ సిరీస్ లో నిహారిక నటిస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ వెబ్ సిరీస్ లో యాంకర్ అనసూయ మరో కీలక రోల్ చేస్తున్నారు.
పెళ్ళికి ముందు వరుసగా నాలుగైదు చిత్రాలు చేసినా నిహారికకు సరైన బ్రేక్ రాలేదు. మరి పెళ్లి తరువాతైనా నిహారిక నటించిన చిత్రాలు విజయం సాధించి, హీరోయిన్ గా బిజీ అవుతుందేమో చూడాలి.
Niharika Konidela