దానికి కారణంగా కొన్ని సోషల్ మీడియా పోస్ట్స్ తెలియజేస్తున్నాయి. మార్చ్ 28న అను ఇమ్మానియేల్ బర్త్ డే జరుపుకుంది. ఆమెకు కొంచెం లేటుగా బర్త్ డే విషెష్ తెలియజేసిన అల్లు శిరీష్ చాలా బాధపడ్డారు. అదే సమయంలో తనతో సన్నిహితంగా ఉన్న వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
సదరు వీడియోలో అల్లు శిరీష్, అను ఇమ్మానియేల్ డిన్నర్ కి రెస్టారెంట్ కి వెళ్లినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. వీరిద్దరూ కలిసి నటించకపోయినా వీరి మధ్య స్నేహం ఎలా కుదిరిందో అర్థం కావడం లేదు.
అల్లు శిరీష్, ఇమ్మానియేల్ మధ్య ఎఫైర్ మాత్రం కన్ఫర్మ్ అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ త్వరలో కలిసి ఓ సినిమాలో కూడా నటించనున్నారట.
మరి ఈ బంధం ఇలాగే కొనసాగితే అల్లు వారి కోడలు కావడం ఖాయం. కట్టిపడేసే అందం ఉన్నా అను కు కాలం కలిసి రాలేదు. టాలీవుడ్ లో ఆమెకు సరైన బ్రేక్ రాలేదు.
తెలుగులో ఆమె డెబ్యూ మూవీ మజ్ను మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఆమెకు సరైన హిట్ తగలలేదు.
పవన్ కళ్యాణ్ 25వ చిత్రం అజ్ఞాతవాసి మూవీలో అను ఒక హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా ఘోరంగా పరాజయం పొందడంతో అను కు స్టార్ హీరోగా పక్కన ఛాన్స్ లు రావడం లేదు.