థార్డ్ వేవ్ కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అటు రాజకీయ నాయకులు.. ఇటు ఫిల్మ్ సెలబ్రెటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్,తమన్, రాజకీయ నాయకుల్లో చంద్రబాబు, లోకేష్ లాంటి వారిని కూడా థార్డ్ వేవ్ వదిలిపెట్టలేదు. వారం క్రితం కరోనా వచ్చిందని ప్రకటించిన హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) .. తనకు నెగెటివ్ వచ్చిందంటూ అనౌన్స్ చేసింది.