స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ డ్రెస్‌లో నిధి అగర్వాల్‌ మత్తెక్కించే పోజులు.. ఉబికి వస్తోన్న పరువాలతో హాట్‌ బ్యూటీ రచ్చ

Published : Sep 04, 2023, 01:52 PM ISTUpdated : Sep 04, 2023, 04:59 PM IST

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ చాలా రోజులుగా సినిమాలకు దూరమైంది. కనిపించి చాలా కాలమవుతుంది. దీంతో మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా `సైమా`లో మెరిసింది.   

PREV
19
స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ డ్రెస్‌లో నిధి అగర్వాల్‌ మత్తెక్కించే పోజులు.. ఉబికి వస్తోన్న పరువాలతో హాట్‌ బ్యూటీ రచ్చ

నిధి అగర్వాల్‌.. తెలుగులో కనిపించి ఏడాది పైనే అవుతుంది. చివరగా ఆమె `హీరో` చిత్రంలో మెరిసింది. ఇది పెద్దగా ఆడలేదు. దీంతో ఈ బ్యూటీ అడపాదడపా సోషల్‌ మీడియాలో తప్ప బయట కనిపించింది లేదు. ఏడాదిన్నర తర్వాత మీడియా ముందు మెరిసిందీ భామ. 
 

29

ఇందులో బ్లాక్‌ డ్రెస్‌ ధరించి కనిపించింది. స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ టైట్‌ ఫిట్‌లో హోయలు పోయింది. ఉబికి వస్తోన్న ఎద అందాలతో కిల్లర్‌ పోజులిచ్చింది. చిలిపి నవ్వులు, లవ్ సిగ్నల్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

39

నిధి అగర్వాల్‌ తాజాగా `సైమా` వేడుకలో పాల్గొంది. త్వరలో దుబాయ్‌లో ఈ ఈవెంట్‌ జరగనుంది. ప్రతి ఏడాది సైమా అవార్డు వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ సారి దుబాయ్‌లో ప్లాన్‌ చేశారు. ఈ సందర్బంగా ఈ అవార్డు వేడుకకి సంబంధించిన కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో ఆదివారం జరిగింది. 
 

49

ఈ ఈవెంట్‌ కోసం బయటకు వచ్చింది నిధి అగర్వాల్‌. మరింత హాట్‌ గా ముస్తాబై అలరించింది. ఈ సందర్భంగా కెమెరాలకు పోజులివ్వగా ఆయా ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులను అలరిస్తుంది. చాలా కాలం తర్వాత ఈ బ్యూటీని చూసి ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషి అవుతున్నారు. దీనికితోడు ఆమె గ్లామర్‌ ట్రీట్‌కి పండగ చేసుకుంటున్నారు. 
 

59

ఇందులో నిధి అగర్వాల్‌తోపాటు మరో హీరోయిన్‌ మీనాక్షి చౌదరి, రానా పాల్గొన్నారు. సైమా నిర్వహకులు పార్టిసిపేట్‌ చేశారు. ఇందులో నిధి అగర్వాల్‌ మాట్లాడింది. తనకు సినిమాల పరంగా వచ్చిన గ్యాప్‌ గురించి, అలాగే ఈ ఈవెంట్‌లో డాన్సు చేయడంపై ఆమె రియాక్ట్ అయ్యింది. 
 

69

సినిమాలకు గ్యాప్‌ రావడంపై స్పందిస్తూ, గ్యాప్‌ తీసుకోలేదని, గ్యాప్‌ వచ్చిందని `అలా వైకుంఠపురములో` అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌నే రిపీట్‌ చేసింది. నటీనటుల కెరీర్‌లో కొన్నిసార్లు అలా జరుగుతుంటాయని, వాటి నుంచి నేర్చుకోవాలని, మళ్లీ అలా జరగకుండా చూసుకోవాలని తెలిపింది. 
 

79

ఈ సందర్భంగా ఐటెమ్‌ సాంగ్ లు చేయడంపై నిధి అగర్వాల్‌ రియాక్ట్ అవుతూ, డాన్స్ చేయడమనేది ఒక ఆర్ట్ అని, దాన్ని ఐటెమ్‌ సాంగ్‌ అనే పేరుతో పిలవకూడదని చెప్పింది. డాన్సు ని ఎంతో ఇష్టంతో చేస్తామని, ఒక ఫీల్‌తో చేస్తామని, అది ఎంతో మందిని అలరిస్తుందని చెప్పింది. ఇలాంటి ఈవెంట్లలో డాన్స్ చేయడాన్ని తాను బాగా ఇష్టపడతానని పేర్కొంది. 
 

89

`సవ్యసాచి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్‌. ఇందులో నాగచైతన్యకి లవ్‌ ఇంట్రెస్ట్ గా నటించి ఆకట్టుకుంది. అందాల ఘాటు చూపించింది. దీంతోపాటు `మిస్టర్‌ మజ్ను` చిత్రంలో అఖిల్‌తో మెరిసింది. అనంతరం రామ్‌తో `ఇస్మార్ట్ శంకర్‌` సినిమా చేసి విజయాన్ని అందుకుంది. ఇస్మార్ట్ బ్యూటీగా పాపులర్‌ అయ్యింది. 
 

99

`ఇస్మార్ట్ శంకర్‌`తో తొలి బ్రేక్‌ అందుకుంది. దీంతో ఏకంగా పవన్‌తో `హరిహర వీరమల్లు` చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. కానీ ఈ సినిమా షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోవడంతో ఈ బ్యూటీ బయటకు రాలేకపోతుంది. తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. కానీ ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నట్టు చెప్పింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories