ఇస్మార్ట్ భామకి బ్యాడ్‌ టైమ్‌.. ట్రోల్స్ పై నిధి అగర్వాల్‌ స్పందన.. ఇప్పుడే అది తెలుసుకున్నా అంటూ..

Published : Apr 30, 2023, 10:13 AM IST

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌.. తనపై వస్తోన్న ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యింది. నిధి నటిగా కాకుండా గ్లామర్‌ భామగానే అలరిస్తుందనే కామెంట్లపై ఆమె రియాక్ట్ అయ్యింది.   

PREV
15
ఇస్మార్ట్ భామకి బ్యాడ్‌ టైమ్‌.. ట్రోల్స్ పై నిధి అగర్వాల్‌ స్పందన.. ఇప్పుడే అది తెలుసుకున్నా అంటూ..

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ ఒక్కసారిగా దూసుకొచ్చిన నటి. ఆమె రావడం రావడంతోనే గ్లామర్‌ పోత పోస్తూ ఆకట్టుకుంటుంది. హాట్‌ సెన్సేషనల్‌ గా మారిన ఈ భామ కొద్ది రోజుల్లోనే హాట్‌ కేక్‌లా మారింది. కానీ అంతలోనే ఫేడౌట్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమాలు లేవు. ఆ మధ్య జ్యోతిష్యుడు వేణు స్వామి వద్ద పూజా కార్యక్రమాల్లో పాల్గొని హాట్ టాపిక్‌ అయ్యింది. మరోవైపు తమిళ స్టార్‌ ఉదయనిధి స్టాలిన్‌తో లవ్ లో ఉన్నట్టు వార్తలతో మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. 
 

25

అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పవన్‌ కళ్యాణ్‌ `హరిహర వీరమల్లు` తప్ప మరో సినిమా లేదు. అది కూడా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో తెలియని పరిస్థితి. షూటింగ్‌ డిలే అవుతుంది. దీంతో ప్రజెంట్‌ ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దీంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిధికి బ్యాడ్ టైమ్‌ నడుస్తుందంటున్నారు. నిధి గ్లామర్‌ బ్యూటీనే అని, నటన పరంగా మెప్పించలేదని అంటున్నారు. అందుకే సినిమాలు తగ్గాయా? అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై నిధి అగర్వాల్‌ స్పందించింది. 

35

ఓ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ మాట్లాడుతూ, నటన గురించి పూర్తిగా తెలిసిన వారు ఎవరూ ఉండరని తెలిపింది. నటన గురించి అన్ని విషయాలు అందరికి తెలియవని, అందులో తాను కూడా ఉన్నట్టు తెలిపింది. తాను ఇప్పటి వరకు సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించే విషయంపైనే ఫోకస్‌ పెట్టానని, అందుకే గ్లామర్‌ పాత్రల్లో కనిపించినట్టు తెలిపింది. ఇప్పుడిప్పుడు నటన గురించి కొత్త విషయాలు తెలుసుకుంటున్నట్టు చెప్పింది నిధి. 

45

ముఖ్యంగా ఓటీటీలు వచ్చాక వెబ్‌ సిరీస్‌లను చూస్తూ నటన మెరుగుపర్చుకుంటున్నట్టు తెలిపింది నిధి అగర్వాల్‌. మున్ముందు టాలెంటెడ్‌ డైరెక్టర్స్ తో పనిచేయాలని, నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం  పవన్‌తో నటిస్తున్న `హరిహర వీరమల్లు` మూవీలో తన పాత్రకి నటనకు స్కోప్‌ ఉందని, కచ్చితంగా తన పాత్ర ఆకట్టుకుంటుందని చెప్పింది బోల్డ్ బ్యూటీ నిధి. 

55

గ్లామర్‌ డోస్‌ పెంచి టాలీవుడ్‌ని ఊపేస్తున్న నిధి అగర్వాల్‌.. `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతో బ్లాక్‌ బస్టర్ అందుకుంది. ఇందులో శృతి మించిన గ్లామర్‌ డోస్‌తో అరించింది. బోల్డ్ బ్యూటీగా నిలిచింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు వస్తాయని భావించింది. కానీ ఆశించిన స్థాయిలో రాలేదు. ఇప్పుడు ఆమె చేతిలో పవన్‌ సినిమా తప్ప మరేది లేదు. సరైన ఆఫర్ల కోసం వేచి చూస్తున్నట్టు చెప్పిందీ హాట్‌ హీరోయిన్. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories