సమంత ఒక్క సోషల్‌ మీడియా పోస్ట్ కి షాకింగ్‌ రెమ్యూనరేషన్‌?.. సైడ్‌ ఇన్‌కమ్‌ గట్టిగానే ఉందిగా!

Published : Apr 30, 2023, 09:44 AM IST

అనారోగ్య సమస్యలతో, అనేక విమర్శలతో వార్తల్లో నిలుస్తున్న సమంత.. సంపాదనలోనూ హాట్ టాపిక్‌ అవుతుంది. ఆమె అటు సినిమాలు, ఇటు సోషల్‌ మీడియా, కమర్షియల్‌ యాడ్స్, వ్యాపారాల నుంచి గట్టిగానే సంపాదిస్తుందట.  

PREV
15
సమంత ఒక్క సోషల్‌ మీడియా పోస్ట్ కి షాకింగ్‌ రెమ్యూనరేషన్‌?.. సైడ్‌ ఇన్‌కమ్‌ గట్టిగానే ఉందిగా!

సమంత లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదుగుతుంది. ఆమె నటించిన `శాకుంతలం` ఆడితే ఆమె లెక్క వేరే ఉండేది. కానీ ఈ సినిమా డిజప్పాయింట్‌ చేసింది. అయినా సమంత క్రేజ్‌ తగ్గలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆమెకి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతని రెండున్నర కోట్ల మంది ఫాలో అవుతుంటే, ట్విట్టర్‌లో కోటీ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్‌బుక్‌తో కలిసి ఆమెకి సుమారు నాలుగు కోట్ల ఫాలోవర్స్ ఉన్నారు. 
 

25

ఇదిలా ఉంటే సమంతకి సోషల్‌ మీడియా ఆదాయ మార్గంలా మారింది. ఆమెకి ఉన్న ఫాలోవర్సే ఇన్‌ కమ్‌ సోర్స్ గా మారడం విశేషం. సోషల్‌ మీడియాలో ఎంత ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉంటే, అంత ఎక్కువగా సంపాదిస్తున్నారు సెలబ్రిటీలు. సామాజిక మాధ్యమాలు వారికి మరో పెద్ద ఇన్‌కమ్‌ సోర్స్ గా మారాయి. వీరు కమర్షియల్‌ యాడ్స్ చేస్తుంటారు. వాటిని తమ సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా పోస్ట్ చేస్తుంటారు. ఇలా పోస్ట్ చేయడానికి కూడా డబ్బులు వసూలు చేస్తుంటారు. ఇలా సెలబ్రిటీలు, ముఖ్యంగా హీరోయిన్లకి ఇప్పుడు ఇన్‌గ్రామ్‌, ట్విట్టర్‌ సినిమాల తర్వాత మరో ఆదాయ వనరుగా మారిపోయాయి. 
 

35

అందులో భాగంగా సమంత సైతం గట్టిగానే సంపాదిస్తుందట. ఇందులో ఆమె ఒక్కో పోస్ట్ కి ఇరవై లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందట. ఈ లెక్కన సమంత నెలకి రెండుమూడు యాడ్స్ చేస్తుంటుంది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. ఈ లెక్కన ఏడాదికి ఒక్క సినిమాకి మించిన పారితోషికం ఇలా యాడ్స్ రూపంలోనే పొందుతుంది సమంత. ప్రస్తుతం ఆమె టామీ హిట్‌ ఫిగర్‌ వాచెస్‌, మిల్లెట్‌ మిల్క్, పీజీ శిక్ష, పెప్సీ వంటి యాడ్స్ చేస్తుంది. ఇలా యాడ్స్ రూపంలో, అలాగే ఆయా యాడ్స్ పోస్ట్ ల రూపంలో గట్టిగానే సంపాదిస్తుంది సమంత. ఇదంతా వారికి సైడ్‌ ఇన్‌కమ్‌గా చెప్పొచ్చు. 
 

45
Image: Samantha Ruth Prabhu / Instagram

మరోవైపు సమంత రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ ఉన్నారు. ఆమెకి చాలా ఫ్లాట్స్ ఉన్నాయి. హైదరాబాద్‌, ముంబయి వంటి నగరాల్లో ఇళ్లు కొనుక్కుంది సమంత. వాటి విలువ కోట్లల్లో ఉంటుంది. సాకీ అనే ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ని నిర్వహిస్తుంది. దీంతోపాటు ఏకమ్‌ ఎర్లీ లెర్నింగ్‌ ఎడ్యూకేషన్‌ సెంటర్‌ని నడిపిస్తుంది. సూపర్‌ ఫుడ్‌ సంస్థలో ఇన్వెస్టిమెంట్‌ పెట్టింది. దీన్నుంచి ఏకంగా ఏడాది రెండు మిలియన్‌ డాలర్లు అందుకుంటుందట. అలాగే ప్రత్యుష అనే ఎన్టీఓని రన్‌ చేస్తుంది సమంత. దీని ద్వారా ఆమె సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 
 

55
Samantha Ruth Prabhu web

ఇక సినిమాలకు కూడా సమంత గట్టిగానే తీసుకుంటుంది. ఆమె ఇప్పుడు ఒక్కో సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు పారితోషికం అందుకుంటుందని సమాచారం. ఇటీవల `శాకుంతలం` చిత్రంలో మెరిసి సమంత ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో `ఖుషి` సినిమా చేస్తుంది. మరోవైపు హిందీలో వరుణ్‌ ధావన్‌తో కలిసి `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. అలాగే ఓ ఇంటర్నెషన్‌ ప్రాజెక్ట్ ఉంది. ఇలా అన్ని రూపాల్లో సమంత ఏడాదికి పదిహేను నుంచి 20కోట్ల వరకు అర్జిస్తుందని సోషల్‌ మీడియా నుంచి అందిస్తున్న సమాచారం. వాస్తవం ఏంటనేది తెలియాల్సి ఉంది. (ఇది పూర్తిగా సోషల్‌ మీడియా ద్వారా తెలిసిన సమాచారం మాత్రమే)

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories