బబుల్ గమ్ చిత్రానికి కాస్తో కూస్తో హైప్ వచ్చిందంటే అందులో సుమ కష్టం ఎంతైనా ఉంది. ట్రైలర్ లో చూపించిన బోల్డ్ కంటెంట్ కాస్త యువతని అట్రాక్ట్ చేస్తున్నప్పటికీ బబుల్ గమ్ చిత్రానికి బజ్ వచ్చేలా చేసింది మాత్రం సుమ అనే చెప్పాలి. తనకున్న పరిచయాలతో రాఘవేంద్ర రావు, రానా దగ్గుబాటి, అనిల్ రావిపూడి లాంటి అతిథుల సమక్షంలో ట్రైలర్ రిలీజ్ చేయించింది.