మాచర్ల నియోజకవర్గంలో 'విక్రమ్'.. పోయి పోయి ఈ సినిమాకి, నెటిజన్ల ట్రోలింగ్

Published : Aug 13, 2022, 10:51 AM IST

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం'. ఎడిటర్ శేఖర్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం నిన్ననే(ఆగష్టు 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

PREV
16
మాచర్ల నియోజకవర్గంలో 'విక్రమ్'.. పోయి పోయి ఈ సినిమాకి, నెటిజన్ల ట్రోలింగ్

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం'. ఎడిటర్ శేఖర్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం నిన్ననే(ఆగష్టు 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలయింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. 

 

26

దర్శకుడు శేఖర్ స్క్రిప్ట్ పై ఫోకస్ పెట్టకుండా రొటీన్ కంటెంట్ తో బోర్ కొట్టించారని అంటున్నారు. దీనితో ఎన్నో ఆశలు పెట్టుకున్న నితిన్ కి నిరాశ తప్పేలా లేదు. నితిన్ డాన్స్ లు, ఫైట్స్ చాలా బాగా చేశాడనే ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే సినిమాకి వాస్తున్న టాక్ చూస్తుంటే నితిన్ కష్టం వృథా అయినట్లు తెలుస్తోంది. 

36

నెటిజన్లు ఈ చిత్రంపై ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో కమల్ హాసన్ రీసెంట్ బ్లాక్ బస్టర్ విక్రమ్ మూవీలోని బిజియం వాడుకున్నారు. విలన్ కి వార్నింగ్ ఇచ్చిన తర్వాత నితిన్ ని ఎలివేట్ చేసేందుకు విక్రమ్ బిజియం వేశారు. అది నితిన్ కి అంతగా సెట్ కాలేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. 

46
Nithiin

సినిమా బావుంటే పరిస్థితి వేరుగా ఉండేది. కథ ఏమాత్రం కట్టుకోలేదు కాబట్టి ఎన్ని బిల్డప్ లు ఇచ్చినా సెట్ కావు. దీనితో మాచర్ల నియోజకవర్గం చిత్రం ట్రోలర్స్ కి చిక్కింది. విక్రమ్ అద్భుతమైన చిత్రం. ఆ మూవీలో అనిరుద్ అందించిన బిజియం మైండ్ బ్లోయింగ్ అంతే. పోయి పోయి ఆ బ్యాగ్రౌండ్ స్కోర్ ని మాచర్ల నియోజకవర్గం చిత్రానికి  ఉపయోగించుకున్నారు అంటూ ట్రోలింగ్ షురూ చేశారు. 

56

విక్రమ్ చిత్రం తెలుగులో విడుదలయింది నితిన్ సొంత బ్యానర్ లోనే. ఆ మూవీ నితిన్ కి డబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. అంత మాత్రాన ఆ మూవీని నితిన్ ఇలా వాడేసుకుంటే ఎలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

66

ఏది ఏమైనా నితిన్ తన నెక్స్ట్ మూవీ కోసం బాగా కష్టపడాలి. భీష్మ తర్వాత నితిన్ కి సాలిడ్ మూవీ పడలేదు. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. 

click me!

Recommended Stories