Avantika Vandanapu : ‘సపోర్ట్ చేయాల్సిన మీరే ట్రోల్ చేస్తారా’.. అవంతిక వందనపు ఒక్కో మాటకు ఏం సమాధానమివ్వగలం!

First Published Mar 17, 2024, 10:57 PM IST

‘ఇండియా నుంచి ఇలాంటి ట్రోల్స్ ను ఎదుర్కొంటానని అనుకోలేదు’.. అంటూ తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్, నటి అవంతిక వందనపు తనపై నడిచిన ట్రోల్సింగ్ పై స్పందించింది. ఆసక్తికరంగా మాట్లాడింది.

తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అవంతిక వందనపు (Avantika Vandanapu) ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలతో ఫుల్ బిజీగా అయ్యారు. ఆమె నటించిన ఒక్కో చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యాయి. 
 

తాజాగా ‘మీన్ గర్ల్స్ - ది మ్యూజికల్’ (Mean Girls The Musical) అనే చిత్రం ఓటీటీ వేదికన విడుదలైంది. అవంతిక నటనకు ప్రశంసలు అందుతున్నాయి. మీన్ గర్ల్స్ కు కూడా పాజిటివ్ టాక్ దక్కింది. 

ఈ ఫిల్మ్ ప్రమోషన్ లో ఉన్న అవంతిక వందనపు తనపై వచ్చిన ట్రోల్స్ పై తాజాగా స్పందించింది. ఆమె ఇంగ్లీష్ యాక్సెంట్ పై కొందరు ట్రోల్స్ చేయడంపై ఆసక్తికరంగా మాట్లాడింది. తన మాటలు అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. 
 

ఆమె మాట్లాడుతూ... ’నేను అమెరికాలో పుట్టి పెరిగాను. నాకు అమెరికన్ యాక్సెంట్ సహజం. ఇంట్లో ఇండియన్ యాక్సెంట్, స్కూళ్లో ఫ్రెండ్స్ నుంచి అమెరికన్ యాక్సెంట్ మాట్లాడుతాం. ఇక హాలీవుడ్ మీడియాతో తెలుగులో మాట్లాడం లేం కదా...
 

ముఖ్యంగా ఇండియన్ యాక్ట్రెస్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది బాధాకరం. ఒక ఇండియన్, తెలుగు అమ్మాయి హాలీవుడ్ లో సక్సెస్ అవుతుంటే సపోర్ట్ చేయాలి కానీ, విమర్శించడం.. పైగా ఇలాంటి విషయాల్లో క్రిటిసైస్ చేయడం, మీమ్స్, ట్రోల్స్ చేయడం బాధాకరం.
 

నా లైఫ్ లో ఇంతలా ఎప్పుడూ ట్రోల్స్ కు గురవలేదు. నా ఐడెంటిటీని ట్రోల్ చేయడం బాధగా అనిపించింది. ఇక మీన్ గర్ల్ కు ఇండియాలో ఇంత రెస్పాన్స్ ఉంటుందని అనుకోలేదు. తెలిసినా ప్రైడ్ ఉంటదనుకున్నా కానీ.. ఇలాంటి ట్రోల్స్ వస్తయనుకోలేదు’. అంటూ స్పందించింది. ఇక ఆమె మాటాలను నెటిజన్లు సమర్దిస్తున్నారు. ఈమెను ఎలా ట్రోల్స్ చేయాలనిపించిందయ్యా అని ఆమెకు బాధ కలిగించిన వారిని ప్రశ్నిస్తున్నారు.

click me!