బాలకృష్ణ గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌ ,ఎవరెవరు వచ్చారంటే... (ఫొటోలతో...)

Published : Sep 01, 2024, 10:15 PM IST

సెప్టెంబర్ 1న సాయంత్రం పలువురు సినీ పెద్దలు, రాజకీయ నాయకుల సమక్షంలో బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ వేడుక గ్రాండ్ గా జరగుతోంది.  

PREV
19
  బాలకృష్ణ గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌ ,ఎవరెవరు వచ్చారంటే... (ఫొటోలతో...)
Nandamuri balakrishna, NBK 50 Years, Celebrations


నందమూరి బాలకృష్ణ ప్రయాణానికి 50 ఏళ్లు. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో ఆదివారం భారీ స్థాయిలో వేడుక నిర్వహించింది.  తెలుగు పరిశ్రమతోపాటు ఇతర సినీ పరిశ్రమల ప్రముఖులు తరలివచ్చారు. హైదరాబాద్‌ నోవాలెట్‌ ఆడిటోరియమ్‌ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఎవరెవరు వచ్చారంటే...

29
Nandamuri balakrishna, NBK 50 Years, Celebrations


నందమూరి బాలకృష్ణ (Bala Krishna) నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు (NTR) తనయుడిగా సినీ ఇండస్ట్రిలోకి అడుగు పెట్టిన బాలయ్య అతి కొద్దీ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నారు.
 

39
Nandamuri balakrishna, NBK 50 Years, Celebrations


 సీనియర్ ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో 1974లో రిలీజైన తాతమ్మ కల (Tatamma kala) అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు తెరకు నందమూరి బాలయ్య పరిచయమయ్యారు.

49
Nandamuri balakrishna, NBK 50 Years, Celebrations

ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా హీరోగా ఎన్నో సినిమాలలో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాలలో ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు. గత కొన్నేళ్ళ నుంచి టాలీవుడ్ బడా హీరోగా కొనసాగుతున్న ఆయన నేటికీ యంగ్ హీరోలతో పోటి పడుతూ వరుస సినిమాలలో నటిస్తున్నారు. 

59
Nandamuri balakrishna, NBK 50 Years, Celebrations



ఇకపోతే నేటితో ఆయన సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో సెప్టెంబర్ 1 న సినీ పరిశ్రమ ఘనంగా ఆయన గోల్డెన్ జూబ్లీ వేడుకను నిర్వహించాలని సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే సెప్టెంబర్ 1న సాయంత్రం పలువురు సినీ పెద్దలు, రాజకీయ నాయకుల సమక్షంలో బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ వేడుక గ్రాండ్ గా జరగుతోంది.
 

69
Nandamuri balakrishna, NBK 50 Years, Celebrations


బాలకృష్ణతో సినిమాలు చేసిన పలువురు దర్శకులతో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేశ్‌, శ్రీకాంత్‌, రానా, నాని, గోపీచంద్‌, శివ రాజ్‌కుమార్‌, ఉపేంద్ర తదితరులు ఈవెంట్‌లో పాల్గొన్నారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి బాలకృష్ణను శాలువాతో సత్కరించారు. బాలకృష్ణ కుటుంబ సభ్యులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులూ వేడుకకు హాజరయ్యారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.
 

79
Nandamuri balakrishna, NBK 50 Years, Celebrations


 ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రావాల్సి ఉంది. మరోవైపు, చీఫ్‌ గెస్ట్‌గా హాజరుకావాల్సిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రంలో వర్షాల వల్ల నెలకొన్న పరిస్థితుల కారణంగా హాజరుకాలేపోతున్నానని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. బాలకృష్ణకు శుభాకాంక్షలు చెప్పారు.
 

89
Balakrishna

 దీనికి నందమూరి కుటుంబ సభ్యులతోపాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రానా, నాని, సుబ్బరామిరెడ్డి, రఘు రామ కృష్ణం రాజు, కె, రాఘవేంద్రరావు, మురళీమోహన్‌, విజయేంద్ర ప్రసాద్‌, అశ్వినీదత్‌, సుహాసిని, మంచు విష్ణు, మాలశ్రీ, మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మాతలు, నవీన్‌, రవిశంకర్‌, గోపీచంద్‌,  బోయపాటి శ్రీను, పి.వాసు, జయసుధ కుటుంబం,  విశ్వక్ సేన్, తదితరులు పాల్గొన్నారు.  

99
Actor Balakrishna


 బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలోని ‘జై బాలయ్య’ పాటకు డైరెక్టర్‌ రాఘవేంద్రరావు ఓ స్టెప్పు వేసి అతిథులను అలరించారు. ఈ వేడుకకు వచ్చిన పలువురిని చిరంజీవితో కలిసి బాలకృష్ణ పలకరించడం ఈవెంట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే.. తనదైన శైలిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంటూ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజును పలకరించి.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు చిరంజీవి.

Read more Photos on
click me!

Recommended Stories