'జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌' పై రజనీకాంత్‌ షాకింగ్ రియాక్షన్

సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, లైంగిక వేధింపులు అంతటా తీవ్ర చర్చకు దారి తీశాయి.  

Rajanikanth

జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ (justice hema committee report)తో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన సినీ నటీ నటులందరూ మలయాళ ఫిల్మ్‌ ఇండస్ట్రీ (malayalam film industry) గురించే మాట్లాడుకుంటున్న సంగతి తెలసిందే. మళయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, లైంగిక వేధింపులు అంతటా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలోనే పలువురు నటీనటులు మీడియా ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మహిళల రక్షణకు మద్దతు తెలుపుతున్నారు. 

Rajanikanth

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను తెలియజేస్తూ జస్టిస్‌ హేమ కమిటీ ఒక రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం ఇది అంతటా చర్చనీయాశంగా మారింది. దీనిపై మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు  స్పందించకపోవడాన్ని పలువురు తప్పుబట్టారు. ఈ క్రమంలోనే శనివారం అగ్ర నటుడు మోహన్‌లాల్‌ స్పందించారు. 


మోహన్ లాల్  మాట్లాడుతూ...‘‘అమ్మ’ అనేది ఒక ట్రేడ్‌ యూనియన్‌ కాదు. ఒక కుటుంబం లాంటిది. పరిశ్రమను సరైన దిశలో నడిపించడానికి ఎన్నో మంచి పనులు చేశాం. ప్రస్తుతం వస్తోన్న ఆరోపణల దృష్ట్యా కేవలం ‘అమ్మ’ సంఘాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవద్దు. హేమ కమిటీకి సంబంధించిన ప్రతి ప్రశ్నకు మొత్తం సినీపరిశ్రమ సమాధానం చెప్పాలి. మహిళలను వేధించిన దోషులను కచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాలి. అందుకు పోలీసులకు సహకరిస్తాం. పరిశ్రమ ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. నేను ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాదు. పలువురిపై వచ్చిన ఆరోపణల గురించి దర్యాప్తు జరుగుతోంది. అందరినీ నిందిస్తూ.. పరిశ్రమను నాశనం చేయకండి’’ అని హితవు పలికారు.
 

Rajinikanth

ఈ రిపోర్ట్ పై స్పందించమని తాజాగా మీడియా  సూపర్ స్టార్  రజనీకాంత్‌ (rajinikanth)ని సంప్రదించింది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘‘దాని గురించి నాకు తెలియదు సారీ’’ అని బదులిచ్చారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. గత కొన్నిరోజులుగా చర్చనీయాంశంగా మారిన విషయం తనకు తెలియదనడం గమనార్హం అని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడే కాదు.. 1990 నుంచి కూడా రజనీకాంత్‌ మాట రాజకీయాల్లో తూటాల్లా పేలాయనడంలో సందేహం లేదు. 1991లో పోయెస్‌గార్డెన్‌లోని తన ఇంటికి వెళ్తున్న రజనీకాంత్‌ వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఆయనలోని అసలు రాజకీయం పురుడు పోసుకుంది.

ఈ రిపోర్ట్ ను ఉద్దేశించి ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి (Mammootty) స్పందించారు. తాజాగా ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టారు. షూటింగ్‌ ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కలిగించేందుకు నివేదికలో చేసిన సూచనలను స్వాగతిస్తున్నా అని తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చేయాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు.

‘‘సెట్‌లో మహిళలకు ఇబ్బందికర ఘటనలు ఏమీ జరగకుండా దర్శక నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోవాలి. సినీ పరిశ్రమ గురించి అధ్యయనం చేసి, నివేదికను సిద్ధం చేసి, పరిష్కారాలను సూచించడానికి ప్రభుత్వం జస్టిస్‌ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఉండేలా ఆ నివేదికలో పేర్కొన్న సూచనలు, పరిష్కారాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. వాటిని అమలు చేసేందుకు చిత్ర పరిశ్రమలోని అన్ని అసోసియేషన్స్‌ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది అని అన్నారు.

రజనీకాంత్  తన తదుపరి చిత్రం ‘వేట్టైయాన్‌’ రిలీజ్‌పై మాట్లాడుతూ.. ‘‘అక్టోబర్‌ 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. (అదే రోజు విడుదల కావాల్సిన కంగువా వాయిదాని ఉద్దేశించి) థాంక్యూ సూర్య. నువ్వు నటించిన ‘కంగువా’ కూడా సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్‌ పతాకంపై ఇది నిర్మితమైంది. అమితాబ్‌ బచ్చన్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా కీలక పాత్రలు పోషించారు.

Latest Videos

click me!